స్పెషల్ రింగ్ తో తళుక్కుమన్న సమంత.. మ్యాటర్ అదేనా..!

స్టార్ హీరోయిన్ సమంతకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయవసరం లేదు. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ధంన్నర కాలం పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగుతో పాటు.. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల్లో నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ దూసుకుపోతుంది. కాగా.. సామ్ ఇటీవ‌ల‌ కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నా.. తన పర్సనల్ విషయాలతో తెగ వైరల్ గా మారుతుంది.

తాజాగా ఓ స్పెషల్ రింగ్ తో తళ్ళుక్కున మెరిసింది సమంత. ఈ క్రమంలోనే ఇంతకీ ఆ స్పెషల్ రింగ్ ఏంటి.. అసలు మేటర్ ఏంటో అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడ‌మొరుతో ప్రేమాయణం నడుపుతుందని, వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. వాటికి తోడు వీళ్ళిద్దరూ కలిసి క్లోజ్ గా తిరుగుతున్న, దిగిన ఫొటోస్ సైతం సోషల్ మీడియాలో ట్రెండింగా మారాయి. ఈ విషయంపై సమంత కానీ.. రాజ్ నిడ‌మొరు కానీ.. ఎవరు రియాక్ట్ అవలేదు.

కాగా.. అక్టోబర్ 6న ఈ జంట రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ న్యూస్ మాత్రం తెగ వైరల్ గా మారుతుంది. దీనికి తగ్గట్టుగానే తాజాగా సమంత ఓ రెస్టారెంట్‌లో చిల్ల్ అవుతూ స్టిల్స్ ఇచ్చిన‌ ఫోటోలలో ఓ స్పెష‌ల్ రింగ్ హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి. అయితే.. ఈ ఫొటోస్ లో సమంత చేతికి ఉన్న‌ స్పెషల్ రింగ్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది రాజ్ నిడమొరు సామ్‌కు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అంటూ.. వీళ్ళిద్దరికీ ఇప్పటికే సీక్రెట్ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుందంటూ.. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం పక్కా అంటూ.. రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరీ.. ఇప్పటికైనా ఈ వార్తలపై సమంత కాని.. రాజ్ నిడ‌మొరు కానీ.. రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇస్తారో.. లేదో.. చూడాలి.