స్టార్ హీరోయిన్ సమంతను ఫుల్ లెంగ్త్ రోల్‌లో ఆడియన్స్ వెండితెరపై చూసి దాదాపు రెండున్నర ఏళ్ళు గడిచిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ అమ్మడు.. తర్వాత హిరోయిన్‌గా ఏ సినిమాలోను కనిపించలేదు. కేవలం తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శుభం సినిమాలో గెస్ట్ రోల్‌లో కొద్ది నిమిషాల పాటు మెరిసింది. ఈ క్రమంలోనే సమాంత వెండి తెరపై ఫుల్ లెంగ్త్ రోల్‌లో మెరిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఆశ పడుతున్నారు.
అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేసిన సమంత.. తన సినిమాల విషయంలో బ్రేక్ గురించి రియాక్ట్ అయింది. ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యల కారణంగా సినిమాలకు దూరమైనట్లు చెప్పిన ఆమె.. ప్రస్తుతం వాటిపైనే తన దృష్టి ఉందని.. తరచుగా సినిమాల్లో కనిపించడం కంటే.. మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకుని నటించేందుకే నేను ఇష్టపడతాను అంటూ వివరించింది. ఇక సినిమాలతో పాటు.. సామాజిక సేవల్లోను ఎప్పుడు యాక్టివ్ గా ఉండే తాను.. ఇప్పటికే ఎంతోమందికి చేయూతనిచ్చింది.
ఇక ప్రస్తుతం.. సమంత, రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ రక్త బ్రాహ్మండ్‌లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఫైనాన్షియల్ సమస్యల కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని టాక్ ఇటీవల వైరల్ గా మారుతున్న క్రమంలో ఈ విషయంలో వాస్తవం లేదని సమంత క్లారిటీ ఇచ్చింది. నెట్‌ఫిక్స్ రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత మరో సినిమాలో నటించనుంది. ఈ సినిమాకు మా ఇంటి బంగారం అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారట. ఇక పలు ప్రజెక్ట్‌లతో ప్రస్తుతం బిజీగా ఉన్న సామ్.. మంచి కంటెంట్ దొరికితే నటించేందుకు సిద్ధంగా ఉంది.