సింగిల్ కామెంట్ తో ” కూలి “పై హైప్ డబుల్ చేసిన రజినీ.. ఏమన్నాడంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సషనల్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి టాక్ తెగ వైరల్ గా మారుతుంది. దీనికి ప్రధాన కారణం సినిమాలో ఉన్న క్యాస్టింగ్. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, సౌభిన్ షాహిద్ తదితరులు కీలకపాత్రలో మెర‌వ‌నున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మరింత హైప్‌ పెరిగింది. ఇక సినిమాకు మ్యూజిక్ అందించడం మరో హైలెట్. కాగా.. ఇప్పటికే కొలివుడ్ రూపొందిన‌ రజనీకాంత్ సినిమాలు ఎన్నో దేశాన్ని మొత్తం షేక్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా.. చివరిగా జైల‌ర్ సినిమాతో పాన్ ఇండియాలో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న రజనీకాంత్.. మళ్లీ తను రేంజ్ సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకొనున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ మూవీ ఆగస్టు 14న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు మేక‌ర్స్‌. ఇందులో భాగంగానే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రజనీకాంత్.. సినిమా గురించి మాట్లాడుతూ ఇంట్రెస్ట్ విషయాలను పంచుకున్నాడు. జైలర్ సినిమాకు అనిరుధ్‌ అందించిన హుకుమ్ సాంగ్ హైలెట్. ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ అనడంలో సందేహం లేదు. రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం తెగ ఎంజాయ్ చేశారు. హీరోయిజం మ్యూజిక్‌తోనే ఎలివేట్ చేయడంలోనే అనిరుధ్ దిట్ట‌. ఈ క్రమంలోనే అప్పట్లో రజినీకాంత్ రియాక్ట్ అవుతూ.. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా హుక్కుమ్ సాంగ్ మించిన సాంగ్ అనిరుధ్ ఇవ్వలేడేమో ఆ రేంజ్‌లో ఉందంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు.. స్టేజిపై ముద్దుపెట్టిన మూమెంట్ ఫ్యాన్స్ ఇప్పటికి మర్చిపోరు.

Powerhouse - Official Lyric Video | Coolie | Superstar Rajinikanth | Sun  Pictures | Lokesh | Anirudh

అలాంటిది తాజాగా కూలి సినిమా నుంచి రిలీజ్ అయిన పవర్ హౌస్ సాంగ్ ఫ్యాన్స్ కు పూన‌కాలు తెప్పిస్తుందని యూనిట్ సభ్యుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రజనీ ఫ్యాన్స్ ఏ కాదు ఇతర హీరోల అభిమానులు సైతం సాంగ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా రజనీకాంత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హుకుం పాటకు డబల్ హైప్ ఇచ్చే రేంజ్ లో ఈ పవర్ హౌస్ ఉందని చెప్పుకు రావడం మరింత హైప్ ను పెంచేసింది. హుక్కు రేంజ్ సాంగ్ ను మళ్లీ లైఫ్లో అనిరుధ్ ఇవ్వ‌లేడని భావించా. కానీ.. నా అభిప్రాయాలు అన్నింటిని తప్పని అనిరుధ్‌ పవర్ హౌస్‌తో నిరూపించాడు. అతని మ్యూజిక్ పవర్ ఏంటో మరోసారి ఈ సాంగ్ తో లోకానికి చెప్పనున్నాడు అంటూ రజనీకాంత్ వివరించాడు. రజినీకాంత్ చేసిన ఈ సింగిల్ కామెంట్ కూలీ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను రెట్టింపు చేసేసింది.