టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పాన్ ఇండియా లెవెల్లో దర్శకధీరుడు రాజమౌళి తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి ఓ సినిమా వస్తుంది అంటే కేవలం టాలీవుడ్ ఆడియన్స్ ఏ కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియోస్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. రాజమౌళి తన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకొని.. ఎలాగైనా పాన్ వరల్డ్‌లో తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాలని కసితో రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు.
తను అనుకున్నట్లుగానే మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి ఐడెంటినీ క్రియేట్ చేసుకుంటాడా.. మహేష్ బాబుకి ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ ని తెచ్చి పెడతాడు.. వేచి చూడాలి. రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేశాడు. మూడో షెడ్యూల్ కోసం కెన్యాకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే.. అక్కడ పరిస్థితులు బాగా ఒప్పుకోవడంతో కెన్యా స్కెడ్యూల్ క్యాన్సిల్ చేసిన జక్కన్న.. ఇప్పుడు కొంత సమయం దొరకడంతో తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కొన్ని సీన్స్ ను మార్చేసి వేరే రైటర్‌తో రీ క్రియేట్ చేస్తున్నాడట.
కారణం ఆ సన్నివేశాలు రాజమౌళికి పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదట. ఇప్పటికే.. సినిమా డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్న దేవకట్టతో కలిసి కథలోని కొన్ని సీన్లను, డైలాగులను చేంజ్ చేసే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్లు సమాచారం. తను అనుకున్నట్లుగా సినిమా స్టోరీని డిజైన్ చేయించుకొని.. డైరెక్టర్గా తనని తాను పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటాడు.. ఎంతలా సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి. ఇక పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి సినిమాతో సత్తా చాటితే మాత్రం జేమ్స్ కెమరున్ లాంటి.. స్టార్ డైరెక్టర్లు సైతం వెనుక నెట్టినట్లే అవుతుంది. అంత పెద్ద స్టార్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తే తెలుగు ఇండస్ట్రీనీ వరల్డ్ నెంబర్వన్ గా నిలబెట్టిన ఘనత రాజమౌళికి దక్కుతుంది.