టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజె ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే వరుస ఫ్లాపులతో ఉన్నాడు కానీ.. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోకు బద్రితో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రేంజ్ పూరీతి. ఈ సినిమాతో వైవిధ్యమైన సినిమాలు చేసే డైరెక్టర్ ఇండస్ట్రీలోకి వచ్చాడని చర్చించుకునేంతలా సక్సెస్ అందుకున్నాడు. దానికి తగ్గట్టుగానే తర్వాత ఆయన ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్‌లో కొట్టి.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా నిలిచాడు. అలాంటి పూరీ.. ఇటీవల లైగర్, డబ్బుల్ ఇస్మార్ట్ సినిమాలతో ఘోర డిజాస్టర్‌లను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే పూరీతో సినిమాలు చేయడానికి ఏ స్టార్ హీరోలు సిద్ధంగా లేరు. అసలు ఆయనతో సినిమాలు చేయడానికి చిన్న హీరోలు సైతం ఒప్పుకునే అవకాశం లేదంటూ ప్రచారాలు తెగ వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే పూరీ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చి స్ట్రాంగ్ గా.. ట్రోల్స్‌కు కౌంటర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. దానికోసం సరికొత్త కాంబినేషన్‌ను సెట్ చేసుకున్నాడు. తమిళ్‌తో పాటు.. తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ సేతుపతిని రంగంలోకి దింపాడు. ఆల్రెడీ ఈ సినిమా షూట్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పట్ల పూరి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. సినిమాకు బెగ్గర్, భవతి బిక్షన్‌దేహి.. ఈ రెండు టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే.. మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టే ప్రయత్నంలో పూరి బిజీ అయ్యాడట.
వారిలో.. ఒక ప్రాజెక్ట్ హీరో శివ కార్తికేయన్ లేదా.. సూర్యను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. మరో ప్రాజెక్ట్ లో టాలీవుడ్ లోని క్రేజీ హీరోని తీసుకోనున్నాడట. పూరీ గతంలో చేసిన సినిమాలు ద్వారా యూత్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడో.. మళ్ళీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వెనక్కు తెచ్చుకునే యూత్ బెస్ట్ సబ్జెక్ట్‌ను సెలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. విజయ్ మూవీ సెట్స్‌పై ఉండగానే.. ఈ రెండు మూవీస్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందట. మరి ఈ సినిమాలన్నీటితో పూరి తన పూర్వ వైభవాన్ని దక్కించుకుంటాడో.. లేదో.. చూడాలి.