ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోని వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజమౌళి అయితే తన సినిమాలతో ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడో.. ఏ రేంజ్‌లో సక్సెస్ లో అందుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు అంతా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో జక్కన్న పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ను కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ఇక ఇటీవల మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందని అంత భావించారు.
కానీ.. కేవలం ఒకే ఒక పోస్టర్ అది కూడా మహేష్ ఫేస్ రివిల్ చేయకుండా రిలీజ్ చేసీ ఫ్యాన్స్ లో నిరాశ మిగిల్చాడు. ఈ క్రమంలోనే.. రాజమౌళి ఫ్యాన్స్ డిస్పాయింట్మెంట్‌ను అర్థం చేసుకొని.. నవంబర్‌లో సినిమాకు సంబంధించిన అప్డేట్.. వినూత్నంగా ఆడియన్స్ కు అందించనున్నట్లు వెల్లడించాడు. ఇక సినిమా తాజాగా 3వ స్కెడ్యూల్ పూర్తి చేసుకుని నాలుగో షెడ్యూల్లోకి అడుగుపెడుతుంది. సౌత్ ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఇక సినిమాలో ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ స్పాట్లో దిగిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా వేదికగా పంచుకుంది.
ఈ ఫోటోలను చూసిన చాలా మంది ప్లేస్.. కెన్యనే అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోస్ట్ వైరల్‌గా మారడంతో.. మహేష్ భార్య నమ్రత సైతం ఈ ఫోటోలకు లైక్ చేసింది. ఏదేమైనా సినిమాకు సంబంధించిన అప్డేట్లు మహేష్ గాని.. సినిమాలో నటిస్తున్న ఇతర నటినటులు కానీ.. కాస్త కూడా రిపీట్ చేయకుండా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆసక్తి మరింతగా పెరిగిపోతుంది. రాజమౌళి ఏ అప్డేట్ ఇచ్చిన హై రేంజ్ లో సినిమా పై బజ్ నెలకొంటుంది. ఈ క్రమంలోనే జక్కన్న సైతం ఓ పవర్ ప్యాకెట్ అప్డేట్‌తో వీలైనంత త్వరగా ఫాన్స్ ను ఖుషి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
View this post on Instagram