ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. ఆ బ్లాక్ బస్టర్ ఫ్రీక్వెల్ లో తారక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా దేవరతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన‌ ఎన్టీఆర్.. నెక్స్ట్ విర్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌తో పాటు.. హృతిక్ రోషన్ మరో హీరోగా ఉన్నాడు. ఇక తారక్ ఇది మొట్టమొదటి బాలీవుడ్ స్ట్రైట్ మూవీ కావడం విశేషం. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాతో పాటు దేవర పార్ట్ 2 లైనప్‌లో ఉంది. ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్‌కు సంబంధించిన మరో సరికొత్త అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది.

ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఓ సినిమా ఫ్రీక్వెల్‌లో తారక్ కామియో రోల్‌లో మేరవనున్నాడంటూ న్యూస్ ఆడియన్స్‌లో పూనకాలు తెప్పిస్తుంది. ఇంతకీ.. ఆ మూవీ ఏంటి అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కోలీవుడ్ స్టార్ యాక్టర్ రీషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ కాంతారా చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా సిక్వెల్‌గా కాంతార 2 ప్రస్తుతం రూపొందుతుంది. తాజాగా కాంతారా 3కి సంబంధించిన అప్డేట్స్ సైతం నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. అక్టోబర్ 2న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న కాంతారా 3 రూపొందనుందని ఇప్పటికే సినిమా షూట్ కొంతమేరకు పూర్తయింది అంటూ టాక్‌ నడుస్తుంది.

Kantara movie actor prabhas praises the rishab shetty movie kanthara |  Kantara movie: "മികച്ച ആശയവും ത്രില്ലടിപ്പിക്കുന്ന ക്ലൈമാക്‌സും";  കാന്താരയ്ക്ക് പ്രശംസയുമായി പ്രഭാസ് ...

ఇక కాంతారా ఎన్టీఆర్ క్యామియో పాత్రలో మరవ‌నున్నాడట. హెంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై అతి తక్కువ బడ్జెట్‌తో రూపోంది బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాంతారా సినిమాకు సీక్వెల్ షూట్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా పై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఇక త్వరలోనే కాంతరా 3 సెట్స్‌లో ఎన్టీఆర్ కూడా మెరువనున్నాడని ఆయన నటించేది కామియో రోల్ అయ్యిన చాలా ప్రభావం ఉంటుందనే టాక్ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే మేకర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.