టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమా షూట్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ నుంచి నెక్స్ట్ రానున్న మూవీ ఓజీ. కేవలం పవన్ అభిమానులు కాదు.. టాలీవుడ్ ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్‌కి ముందే రికార్డులు సృష్టించనుందట. దానికి కారణం ఓజీ సినిమా రిలీజ్ ఇంకా 30 రోజులు టైం ఉన్నా.. ఓవర్సీస్ లో ఇప్పటికే సినిమా రికార్డుల మోత మోగిస్తుంది.
ఆగస్టు 29 నుంచి నార్త్ అమెరికాలో ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించనున్నారు. ఇక సినిమా రిలీజ్ 25 రోజులు ముందే టికెట్ సేల్స్ మొదలు పెట్టడం అనేది చాలా రేర్ జరుగుతుంది. కానీ.. పవన్ ఓజి సినిమాకు ముందే ఓపెన్ బుకింగ్స్ మొదలుపెట్టారంటే.. సినిమాపై ఏ లెవెల్‌లో హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. డిస్ట్రిబ్యూటర్ స్మార్ట్ గా వేసిన ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయితే మాత్రం ఫస్ట్ ప్రీమియర్ పడకముందే ఓజీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రెండు మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాల అంచనా. ఇక్కడ అస్సలు స్ట్రాటజీ ఏంటంటే.. కూలి సినిమాకు క్రియేట్ చేసినట్లుగానే మొదట్లో మంచి బజ్ క్రియేట్ చేస్తే.. ఎన్నారైలు టికెట్ రేట్ ఏదైనా పెట్టేసి టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
అందుకే ఓజీ డిస్ట్రిబ్యూషన్ టీం ఈ విండోని పూర్తిగా యూజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇక హరిహర వీరమల్లు డిజాస్టర్‌తో కొంతమంది బయ్యర్లు భయపడుతున్నా.. ఓజీ మాత్రం గేమ్ చేంజ్ చేసి.. నెక్స్ట్ లెవెల్లో హైప్‌ను క్రియేట్ చేస్తుంది. కానీ.. ఈ హైప్‌ని మెయింటైన్ చేయడం అంత సులువు కాదు. ఇటీవల బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాలు.. వార్ 2, కూలీ రెండు సినిమాలు వారం రోజుల్లోనే థియేటర్లకు గుడ్ బై చెప్పేస్తున్న పరిస్థితి. ఇలాంటి క్రమంలో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసినా.. సుజిత్ చేస్తున్న ఓజీ సినిమాపై ఇంత నమ్మకం పెట్టుకోవడం సాహసమే. సాహు తర్వాత చాలా గ్యాప్‌తో వచ్చే సినిమాను నిర్మిస్తున్నాడు.
అయితే.. సినిమాపై మాత్రం అభిమానులు రాజమౌళి సినిమా లెవెల్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయంపై పూర్తిగా క్లారిటీ లేకున్నా.. ఏపీ తెలంగాణ బ్రేకింగ్ టార్గెట్ మాత్రం ఏదేమైనా కనీసం రూ.200 కోట్ల గ్రాస్ వరకు ఉంటుందని అంచనా. సినిమా టాక్ బాగుంటే.. పవన్ సినిమాల ఊచపోతే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. పవన్ కెరీర్‌లో ఇప్పటివరకు డబుల్ సెంచరీ గ్రాస్ మైల్డ్ స్టోన్ అందుకోలేదు. ఈసారి మాత్రం ఓజీ సినిమాతో ఏదేమైనా రూ.200 కోట్ల మార్క్ అందుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇక సినిమా మ్యూజిక్ విషయంలో థమన్ బలమైన ఇంపాక్ట్ ఇప్పటికే క్రియేట్ చేశాడు. రిలీజ్ అయిన టైటిల్ సాంగ్స్ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక రాబోయే మెలోడీ సాంగ్ ఏ రేంజ్ లో అంచనాలను పెంచేస్తుందో చూడాలి. ఇక సినిమాకు అన్నిటికన్నా మెయిన్ ట్రైలర్. దాన్ని సుజిత్ ఎంత పవర్ఫుల్ గా కట్ చేస్తే.. సినిమాపై గ్రిప్ ఆడియన్స్ లో అంతగా పెరుగుతుంది. ఇక సుజిత్ ట్రైలర్ కట్ తో అంతా సెట్ చేస్తే.. రికార్డుల వేట ఓవర్సిస్‌లోనే కాదు.. వరల్డ్ వైడ్ గా మోగిపోతుంది.