టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా వివాదాల్లో చిక్కుకొని తెగ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఇటీవల అమ్మడు గవర్నమెంట్ వెహికల్లో షికార్లు కొడుతూ అడ్డంగా దొరికిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ వెహికల్లో హీరోయిన్ నిధి అగర్వాల్ ఏపీలో చెక్కర్లు కొట్టింది. తాజాగా విజయవాడ నగరంలో షాపింగ్ మాల్‌కు కూడా ఇదే వెహికల్ లో ఆమె రావడంతో ఆ వీడియో తెగ వైరల్ గా మరుతుంది.
దీంతో అమ్మడితో ఒక ఆట ఆడుకుంటున్నారు జనం. ఇక నిధీ అగర్వాల్ లేటెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కటిసి ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అదే హరి హర వీరమల్లు. ఈ సినిమాలో పవన్ సరసన అమ్మడు రొమాన్స్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఒక్క సినిమా చేసినంత మాత్రాన గవర్నమెంట్ వెహికల్ కూడా ఇచ్చేస్తారా అంటూ పవన్ ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.
గవర్నమెంట్ వెహికల్ లో తిరగడానికి ఆమెకు అసలు ఏం హక్కు ఉంది.. ఇది ఎవడబ్బ సొత్తని ఇలా విచ్చలవిడిగా వాడేస్తున్నారు.. అసలు ఆమెకు గవర్నమెంట్‌తో ఏమైనా సంబంధం ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా జనం మండిపడుతున్నారు. దీనిపై.. ఏపీ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.