ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట్ స్పైయాక్షన్ థ్రిల్లర్ వార్ 2. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే.. ఇదే సినిమాకు కాంపిటీషన్ గా రిలీజ్ అయిన కూలి సినిమాకు మాత్రం సరైన డామినేషన్ ఇవ్వలేకపోయింది. కూలీతో పోలిస్తే వార్ 2 అతి తక్కువ మంది ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంది. దీంతో పాటు.. సినిమా కలెక్షన్ల పై భారీ ఎఫెక్ట్ పడింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఇక సినిమాకు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్‌గా నాగవంశీ వ్యవహరించిన సంగతి తెలిసిందే.
సాధారణంగా.. నాగ వంశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉంటాడు. అలాంటిది.. వార్ 2 సినిమా రిలీజై రిజల్ట్ వచ్చిన తర్వాత.. ఆయన సోషల్ మీడియాకు దూరమైపోయాడు. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. కారణం వార్ 2కి అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్‌లో దారుణమైన రిజల్ట్ రావడమేనని టాక్ నడుస్తుంది. అయితే.. తాజాగా నాగవంశీ ట్విట్టర్ వేదికగా ఈ పుకర్లపై క్లారిటీ ఇచ్చాడు. ఏంటి నన్ను చాలా మిస్ అవుతున్నారు అనుకుంటా.. వంశీ అలా.. వంశీ ఇలా అని గ్రీప్పింగ్ కథనాలు ఎన్నింటినో రాసేస్తున్నారు.
పర్లేదు ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారంటూ రాసుకొచ్చిన ఆయన మీ అందరిని నిరాశ పరిచినందుకు నన్ను క్షమించండి. కానీ.. ఇంకా 10, 15 ఏళ్లు టైముంది. కనీసం 10 సినిమాల్లో మీకు దగ్గర అవుతూనే ఉంటా. మా నెక్స్ట్ మూవీ మాస్ జాతరతో అందరు మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు. ట్రేడ్ టాక్ ప్రకారం దాదాపు రూ.80 కోట్లకు కొనుగోలు చేసిన తెలుగు వెర్షన్ వార్ 2.. ప్రాంతీయ మార్కెట్లో భారీ నష్టాలను ఎదుర్కుంటుంది. ఇక వైఆర్ఎఫ్.. రూ.22 కోట్ల పరిష్కారంతో నాగ వంశీ నష్టాలకు పరిహారం చెల్లించవచ్చని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. అయితే.. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే నాగ వంశీ రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.