మహేష్ ‘ అతడు ‘ అప్పుడు రూ.కోటి సినిమా.. ఇప్పుడెంత వచ్చాయంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 50వ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకొని.. గోల్డెన్ ఇయ‌ర్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ.. తను నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అతడు గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు మేకర్స్. మహేష్ కెరీర్‌లోనే ఈ సినిమాకు చాలా స్పెషల్ ఇమేజ్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. మహేష్‌లో ఒక కొత్త కోణాన్ని ఈ సినిమాతో ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే మొదట సినిమాకు ఊహించిన రేంజ్‌లో రిజల్ట్ రాకపోయినా.. తర్వాత రికార్డులు క్రియేట్ చేసింది.

Athadu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, మణిరత్నం మ్యూజిక్, మహేష్ స్టైలిష్.. యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా.. దాదాపు 20 ఏళ్ల తర్వాత వెండితెరపై మరోసారి ఆడియన్స్‌ను పలకరించింది. ఈ క్రమంలోనే ఆగస్టు 8న పలుచోట్ల ప్రీమియర్ సైతం వేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగయట. ఇక‌ అప్పట్లోనే అతడు మూవీ ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ చాలా వీక్ గా ఉండేది. తక్కువ స్క్రీన్ లలో మాత్రమే సినిమాలు వచ్చేవి. ఎక్కువగా మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేవి. అలాంటి టైంలో అతడు మూవీ రిలీజై బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసింది.

Mahesh Babu's Athadu sets a new record in Indian Cinema

ఇక ఓవర్సీస్ లో రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన హక్కులు.. కోటి రూపాయల కంటే ఎక్కువ వస్తుందని తెచ్చిపెట్టాయి. తర్వాత మహేష్ మరో మూవీ పోకిరి కూడా అక్కడ సత్తా చాటుకుని నెక్స్ట్ లెవెల్ కలెక్షన్లను అందించింది. అయితే.. అప్పట్లో ఊహించిన రేంజ్ లో మహేష్‌కు క్రేజ్‌ లేకున్నా ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు యూఎస్ మార్కెట్‌ను మహేష్ సినిమాలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే అతడు తాజాగా రీ రిలీజ్‌తో ఓవర్సీస్‌లో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంది.. ఏ రేంజ్‌లో కలెక్షన్లను కొల్లగొడుతుందో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అసలు రిజల్ట్ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.