తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో మురారి సైతం ఒకటి. సోనాలి బింద్రే హీరోయిన్‌గా.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు.. మణిశర్మ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అప్పట్లో సంచలన సక్సెస్ అందుకుని రికార్డ్‌లు క్రియేట్ చేసింది. అంతేకాదు.. మహేష్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేశారు. ఇక.. ఈ సినిమాలో మహేష్ నటన నుంచి.. సాంగ్స్, డ్యాన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి మురారి సినిమాల్లో చందమామ.. చందమామ.. సాంగ్ క్లిప్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ఈ సినిమా కథ చెప్పినప్పుడు మహేష్ రియాక్షన్ ఏంటి సార్ అంటూ కృష్ణవంశీని టాగ్ చేశాడు. విషయం ఏంటంటే.. ఆ పోస్ట్ వైరల్ గా మారడంతో.. దానిపై కృష్ణవంశీ రియాక్ట్ అయ్యారు. ఆయనకు నచ్చలేదు అంటు నవ్వే ఇమోజితో ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఇది చూసిన నెటిజన్స్.. తర్వాత ఏం జరిగింది ఎలా మహేష్‌ను ఒప్పించారంటూ రకరకాల ప్రశ్నలను కురిపిస్తున్నారు. కృష్ణవంశీ మాత్రం దీనిపై రియాక్ట్ కాలేదు. కాగా.. స్టోరీ మహేష్ కు నచ్చకపోయినా.. కృష్ణకు బాగా నచ్చిందట. అంతేకాదు.. డైరెక్టర్ కృష్ణవంశీకి స్టోరీ పై ఉన్న నమ్మకాన్ని చూసి.. కృష్ణ స్వయంగా ఈ సినిమా కోసం మహేష్‌ను ఒప్పించాడట. మొదట్లో.. మహేష్ సినిమా చేయనని చెప్పినా.. కృష్ణ కోసం ఒప్పుకొని నటించాడు. ఇక ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుందో.. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే.
He hated it 😀😀😀 https://t.co/s8lKwHOWWa
— Krishna Vamsi (@director_kv) August 7, 2025