ప్రీ సేల్స్ లో కూలీ బీభత్సం.. కోలీవుడ్ హిస్టరీ లోనే మొదటిసారి..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. కింగ్ నాగార్జున విలన్ పాత్రలో, అమీర్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేసిన‌ లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాలో ఉపేంద్ర, సత్య రాజ్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ సైతం కీలక పాత్రలో మెర‌వ‌నున్నారు. మాస్ ఫాక్ట్.. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై అదే రేంజ్‌లో హైప్‌ మొదలైంది. యాక్షన్ స్పెషలిస్ట్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌.. తనదైన స్టైల్ లో ఈ సినిమాను రూపొందించాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ తో ఆడియన్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకొని సినిమాపై హైప్‌ను ఆకాశానికి ఎత్తేశారు మేకర్స్.

యూఎస్ మార్కెట్ లో ఈ సినిమా బీభత్సం సృష్టిస్తోంది. రిలీజ్‌కు ఇంకా ఒక‌ రోజు మిగిలి ఉన్న క్రమంలో కూలి ఫ్రీ సేల్స్ ఒక సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేయడం విశేషం. తమిళ్ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఫ్రీ సేల్స్ తో రెండు మిలియన్ డాలర్ల మార్క్ దాటి కూలీ సంచలనం సృష్టించింది. ఈ రేర్ రికార్డు మరే సినిమాకు దక్కలేదు. దీంతో సినిమాపై ఆడియన్స్‌లో క్రేజ్ ఏ లెవెల్‌లో ఉందో తెలుస్తుంది. రజనీ క్రేజ్ తో పాటు.. లోకేష్ టాలెంట్ పై ఉన్న నమ్మకం కూడా ఈ రేంజ్‌లో హైప్‌ కు కారణం. రజినీకాంత్ తో పాటు.. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, రెబ్బా మౌనిక జాన్, పూజా హెగ్డే ఇలా స్టార్ కాస్టింగ్ అంత ఒకే ఫ్రేమ్ పై కనిపించడం కూడా సినిమాకు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ మరోసారి ఈ సినిమాతో తన మార్క్ ను చూపించనున్నాడట. ఈ క్రమంలోనే ఎప్పటి వరకు సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్‌తో టాప్‌ ట్రెండింగ్ గా దూసుకుపోతున్నాయి. మరీ స్పెషల్ గా.. మాస్ బిట్స్, యాక్షన్ సీక్వెన్స్ ల బిజిఎం తెగ వైరల్ గా మారుతుంది. ఇలా మొత్తానికి రిలీజ్ కు ముందు కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల సునామి తేవడం ఖాయం అంటూ రజనీ, లోకేష్ కాంబోలో బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.