తెలుగె సినీ ఇండస్ట్రీలో జులై నెల ఎంతో కీలకం. జులై నెల లక్కీమంత్‌గా చాలామంది పరిగణిస్తూ ఉంటారు. ఇక జూలై నెలలో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్‌లు అందుకోవడమే కాదు.. మ్చి కలెక్షన్స్ కూడా కొల్లగొట్టాయి. అయితే.. ఈ ఏడాది జులై నెలలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహించిన రేంజ్ లో ఫలితాలు దక్కకపోవడంతో ఈంతా షాక్‌కు గురవుతున్నారు. అలా.. జూలై నెలలో రిలీజ్ అయిన సినిమాలు కింగ్డమ్ తప్పించి.. మిగతా అన్ని సినిమాలు ఫ్లాప్ టాక్‌ను దక్కించుకున్నాయి. జులై మొదటి వారం నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా మంచి అంచనాలతోనే రిలీజ్ అయింది.
అయితే.. ఈ సినిమా రిలీజైన తర్వాత సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రొడ్యూసర్ దిల్ రాజుకు నష్టాలను తెచ్చి పెట్టింది. ఇక అదే వారంలో.. రిలీజ్ అయిన షో టైం, 3బిహెచ్‌కే సినిమాలు సైతం ఫ్లాప్ గా మిగిలిపోయాయి. కేవలం వెండితెరమైన కాదు డిజిటల్ ప్లాట్ఫారం పై వచ్చిన ఉప్పుకప్పురంబు సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక జులై రెండవ వారంలో భామ అయ్యరామ, వర్జిన్ బాయ్స్, దీర్ఘాయుష్మాన్ భవ సినిమాల సైతం రిలీజై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ఇక మిగిలింది జూలై నెల మూడో వారం. కొత్తపల్లిలో ఒకప్పుడు, మై బేబీ, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు రిలీజ్ కాగా.. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించిన రేంజ్ లో రిజల్ట్ అందుకోలేకపోయాయి.
మేకర్స్‌ను నిరాశపరిచాయి. అదే వారంలో రిలీజ్ అయిన జూనియర్ మూవీ మొదటి వారంలో భారీ కలెక్షన్లనే కొల్లగొట్టినా.. తర్వాత మాత్రం కలక్షన్‌లపరంగా వెనుకబడిపోయింది. వీరమల్లు సినిమా అత్యంత భారీ అంచనాలనడుమ రిలీజై.. ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇక జులై చివరి రోజు అంటే నిన్న.. తాజాగా రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా మాత్రం పాజిటీవ్ టాక్‌తో కొనసాగుతుంది. అయితే.. ఫుల్ రన్ ముగిస్తే గాని సినిమా ఒరిజినల్ రిజల్ట్ ఏంటో తెలియదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులై నెల టాలీవుడ్‌కు భారీ షాక్ లు ఇచ్చిందంటు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.