చిరంజీవి సినీ ప్రస్థానం ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషి ,పట్టుదలతో మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఫాదర్గా దూసుకుపోతున్న ఆయన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొన్నారట. అయితే చిరంజీవిలో అంతలా పట్టుదల పెరగడానికి కారణం గతంలో ఆయన ఫేస్ చేసిన అవమానమేనని.. చాలా మంది దర్శక నిర్మాతలతో హీరోయిన్లతో ఆయన అవమానానికి గురైనట్లు స్వయంగా వెల్లడించారు. ఓ రోజు షూటింగ్లో జరిగిన అవమానమే తనలో అంత పట్టుదలను తెచ్చిందని.. ఇంత పెద్ద స్టార్ ను చేసిందంటూ వివరించారు.
ఇంతకీ.. ఆయనకు జరిగిన అవమానం ఏంటి ఒకసారి తెలుసుకుందాం. క్రాంతికుమార్ డైరెక్షన్లో చిరంజీవి న్యాయం కోసం అనే సినిమాలో నటించారు. ఈ సినిమాల్లో చిరంజీవి చిన్న పాత్రలో మెరువగా.. అప్పటికే స్టార్ సెలబ్రెటీల్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శారద, జగ్గయ్య లాంటి నటులు కూడా మెరిసారు. అయితే.. ఈ సినిమా షూటింగ్లో కోర్ట్ సీన్ కు షూట్ జరుగుతుండగా.. జగ్గయ్య, శారద అక్కడే ఉన్నారట. కానీ.. అసిస్టెంట్ వచ్చి పిలవడంతో వెంటనే కోర్ట్ బోన్ లోకి వెళ్లి చిరంజీవి నుంచున్నాడు. కాగా.. చిరంజీవి లేటుగా రావడం చూసిన డైరెక్టర్ క్రాంతి కుమార్.. ఏంటి నువ్వు ఏమైనా స్టార్ సెలబ్రెటీ అనుకుంటున్నావా.. నిన్ను ఒకరు పిలిస్తే వస్తావా.. నీ కంటే సీనియర్స్ నీకోసం వెయిట్ చేయాలా అంటూ.. వాళ్ళందరి ముందే మండిపడ్డాడట.
ఆరోజు డైరెక్టర్ మాట్లాడిన మాటలు చిరు మనసుకు చాలా నచ్చుకున్నాయి. అలా అవమానంగా ఫీల్ అయిన చిరంజీవి షూటింగ్ అయిన వెంటనే బాధగా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సాయంత్రం డైరెక్టర్ క్రాంతి కుమార్ చిరంజీవికి ఫోన్ చేసి సారీ.. వేరే వాళ్ల మీద కోపం నీపైన చూపించాను ఏమనుకోకు అని అన్నాడట. అక్కడితో చిరంజీవి అవమానాన్ని మర్చిపోయినా.. డైరెక్టర్ అన్న.. నువ్వు ఏమైనా పెద్ద స్టార్వా అనే పదాన్ని మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకున్నారు చిరంజీవి. ఈ క్రమంలోని ఆయన మాటలను నిజం చేయాలని ఎంతో కష్టపడి నటనలో తన సత్తా చాటుకున్నాడు. స్టార్ హోదాను దక్కించుకున్నారు. ఇలా.. చిరంజీవి మెగాస్టార్ గా మారడానికి తనకు జరిగిన అవమానమే కారణం అంటూ స్వయంగా వివరించారు.