కూలి – వార్ 2 తెలుగు సినిమాల డైలాగ్ రైటర్ ఒకరే అని తెలుసు.. బ్యాక్గ్రౌండ్ ఇదే..!

ఇండియన్ సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట‌ఫ్ ఫైట్.. కూలీ వర్సెస్ వార్ 2. అయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో యాక్షన్ థ్రిల్లర్గా వార్ 2 రూపొంద‌గా.. లొకేష్ క‌న‌క‌రాజ్‌ డైరెక్షన్‌లో రజినీకాంత్ హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో మెరిసిన మూవీ కూలీ. ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాల మధ్య ఫైట్ నెలకొంది. ఆడియన్స్‌లోను ఏ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచి విన్నర్ గా నిలబడుతుందో తెలుసుకోవాలని ఆసక్తి మొదలైంది. దీనిపై.. ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా చర్చలు కొనసాగుతున్నాయి.

ఇక కూలి సినిమా తమిళ్‌లో రూపొందగా వార్ 2 సినిమా బాలీవుడ్ లో రూపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన‌ క్రమంలో.. రెండు సినిమాలు.. తెలుగు డబ్బింగ్ వర్షన్ ఒరిజినల్ వర్షన్‌తో కలిసి రిలీజ్ చేయనున్నారు. అయితే.. ఈ క్రమంలోనే రెండు సినిమాలకు తెలుగు డైలాగ్స్ రాసిన వ్యక్తి ఒకరే అంటే న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ అతను ఎవరు.. బ్యాగ్రౌండ్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ఎస్.. ముందు చెప్పినట్లుగానే వార్ 2, కూలి సినిమాలకు టాలీవుడ్ డైలాగులను ఒకే ఒక రైటర్ రాశారట. అతనే రాకెందు మౌళి. ఈ టాలెంటెడ్ రైటర్ ఇప్పటికే యానిమల్, ఖైదీ సినిమాలకు టాలీవుడ్ లో డైలాగ్ లు అందించగా బాక్స్ ఆఫీస్ షేక్ చేసి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

అలాగే.. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న మహావతార నరసింహ కు కూడా ఇతనే డైలాగ్స్ రాశాడు. ఈ క్రమంలోనే వార్ 2, కూలి సినిమాలకు రాకెందు మౌళి ఏ రేంజ్ లో డైలాగ్స్ సిద్ధం చేశాడని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక సినిమాల్లో డైలాగ్స్ తో పాటే కొన్ని సాంగ్స్‌ను కూడా రాకేందు మౌళి రాయడం విశేషం. మరి ఈ రెండు సినిమాల రిలీజ్ తర్వాత మౌళి కెరీర్‌లో మరింత బిజీ అవుతాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.