సౌత్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమాయణం నడిపి అతని వివాహం చేసుకుంది. కొంతకాలానికి వీరిమధ్య వివాదాలతో.. విడాకులు తీసుకున్నారు. సమంత సినిమాలపై దృష్టి సాధించినా.. అదే టైంలో తీవ్రమైన డిప్రెషన్ తో మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దీంతో చాలా కాలం పాటు పోరాడిన ఆమె.. విదేశాల్లో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి రాణిస్తుంది. టాలీవుడ్ సినిమాలకు దూరంగానే ఉన్న పలు బాలీవుడ్ వెబ్ సిరీస్‌లలో నటిస్తూ.. అక్కడి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే సమంత ఒక సందర్భంలో మయోస్సైటీస్ లాంటి పెద్ద వ్యాధి నుంచి బయటపడి.. మళ్ళీ సినిమాల్లోకి రావడానికి కారణం ఓ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ అతను ఎవరో కాదు.. రాహుల్ రవీంద్రన్‌ని ఆమె మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న టైంలో రాహుల్ ప్రతిరోజు నా ఇంటికి వచ్చేవాడు.. నాతో గేమ్స్ ఆడి నా వ్యాధిని మర్చిపోయాలా చేశాడంటూ చెప్పుకొచ్చింది.
తనకు ఎంతో సపోర్ట్ చేసి.. మళ్లీ సినిమాల్లోకి రావాలని కన్విన్స్ చేశాడని.. అలా నేను.. రాహుల్ కారణంగా గతాన్ని మర్చిపోయి ఆరోగ్యం సెట్ చేసుకొని.. మళ్లీ కొత్త లైఫ్ ని ప్రారంభించినట్లు వివరించింది. మళ్ళీ సినిమాల వైపు దృష్టి పెట్టాయని చెప్పుకొచ్చింది రాహుల్.. అంతగా బ్రతిమిలాడాడు కనుక నేను మళ్లీ లైఫ్ స్టార్ట్ చేశాను అంటూ సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పటికీ తెగ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దీంతో రాహుల్ రవీంద్రన్ తో సమంత బాండ్ ఎప్పటికీ విడతీయ లేనిదని.. వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్‌ను మించి ఏదో మంచి రిలేషన్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.