యంగ్ బ్యూటీ.. దర్శన బాణీక్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆటగాళ్లు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. పేరుకు బెంగాలీ యాక్టర్స్ అయినా తెలుగులోను నాగార్జున, నారా రోహిత్ లాంటి స్టార్స్ సినిమాలోను నటించి ఆకట్టుకుంది. అయితే.. ఇక్కడ అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఆమె మేట్లాడుతూ కొఒన్నీ షాకింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది.
బెంగాలీ ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్.. నన్ను తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేస్తున్నావ్.. ప్రాబ్లెమ్ ఏమీ లేదా అని ప్రశ్నించారని.. ఎందుకలా అడుగుతున్నారని నేను అడగగా.. తనకు తెలిసిన ఓ నటి ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పాడంటూ వివరించింది. డైరెక్టర్ కు సంబంధించిన ఫిమేల్ కాంట్రాక్టర్‌ను కలిసిన ఆమె.. అగ్రిమెంట్, సెక్సువల్ ఫేవర్స్‌కు సంబంధించిన లిస్ట్ ఇచ్చిందని.. ఓకే అంటే హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లే అని తను నాతో అంది అంటూ చెప్పుకొచ్చాడని.. వివరించింది.
తను కలిసిన వ్యక్తి రాంగ్ పర్సన్ అయి ఉండవచ్చని నేను క్లారిటీ ఇచ్చా. ఇండస్ట్రీలో చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. అలానే కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అది కేవలం ఫిలిమ్ ఇండస్ట్రీ నే కాదు.. ఏ ఇండస్ట్రీలోనైనా మంచి, చెడు రెండు ఉంటాయి. ఎటువైపు వెళ్ళాలనే మార్గాన్ని మనమే నిర్ణయించుకోవాలంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.