టాలీఆవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాతో క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు బన్నీ. ఇకపై చేయబోయే సినిమాల విషయంలోనూ ఆయన అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మంచి హైప్ నెలకొంది. సినిమాతో ఎలాగైనా భారీ బ్లాక్ బాస్టర్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని కష్టపడుతున్నాడు. ఇప్పటికే పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న బన్నీ ఏకంగా రూ.1850 కోట్ల కలెక్షన్లతో ఇండియన్ హైయెస్ట్ గ్రాస్ కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసాడు.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా లెవెల్ లో హీరోలుగా మంచి ఖ్యాతిని సంపాదించుకుంటూ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ టాప్ హీరోలుగా టాలీవుడ్ హీరోలు నెంబర్ వన్ పొజిషన్‌ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోని స్టార్ హీరోలు అందరూ స్టార్ దర్శకులతో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. మంచి కంటెంట్ ను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్‌గా రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా.. బన్నీ – అట్లీ కాంబోలో సినిమా సెట్ అయిన వెంటనే బన్నీ అభిమానులు నెక్స్ట్ లెవెల్ లో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
నిజానికి బన్నీ.. త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉండగా.. త్రివిక్రమ్ చివరగా చేసినా గుంటూరు కారం సినిమా ఫ్లాప్ తో అల్లు అర్జున్ ఆయన సినిమాను రిజెక్ట్ చేసి అట్లిని ఎంచుకున్నాడు. త్రివిక్రమ్‌ను రిజెక్ట్ చేసిమరీ.. అట్లీకి ఛాన్స్ ఇవ్వడం ఎప్పుడు బన్నీ అభిమానులకే నచ్చడం లేదు. అసలు.. అట్లీ అల్లు అర్జున్ నమ్మకాన్ని నిలబెడతాడా.. లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి త్రివిక్రమ్ అభిమానులు సైతం బన్నీ డెసిషన్‌కు అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ప్రజెంట్ ఈ రేంజ్ కు ఎదిగాడు అంటే.. దానికి ఒకప్పటి స్టార్టమే కారణం. అంత స్టార్ ఇమేజ్ ఇచ్చింది త్రివిక్రమే.. అలాంటి త్రివిక్రమ్ గారు మంచి కంటెంట్ తో బన్నీని అప్రోచ్ అయితే.. తనకు స్టార్డం వచ్చిందని రిజెక్ట్ చేయడం చాలా తప్పు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమాను రిజెక్ట్ చేసి బిగ్ మిస్టేక్ చేసాడంటూ కామెంట్లు చేస్తున్నారు.