పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర.. మరి కొద్ది రోజుల్లో బిగ్ బడా వార్ మొదలవనుంది. కూలీ వర్సెస్ వార్ 2 అంటూ.. జోరుగా పోటీ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలోనే స్ట్రాంగ్ వార్‌లో విన్నర్ ఎవరో అనే టాక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ స్ట్రాంగ్ పోటీలో విన్నర్ ఎవరు అనే అంశంపై చర్చలు.. పోలింగ్ తెగ నడుస్తున్నాయి. అంతేకాదు.. పలు షోస్ కూడా.. కండక్ట్ చేస్తూ జనాల్లో సినిమాపై ఉన్న అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఓ పక్క కూలీలతో సూపర్ స్టార్ రజినీకాంత్ ఆడియన్స్‌ను పలకరించనుండగా.. మరోపక్క టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో వప్తున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 వస్తుంది.
రెండు సినిమాలకు భారీ కాస్టింగ్.. బిగ్ బడ్జెట్ ఉన్న క్రమంలోనే ఈ సినిమాల రిజల్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రిత్యా.. రజినీకాంత్ కూలి సినిమా పైనే ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది అనడంలో సందేహం లేదు. కేవలం కోలీవుడ్ నుంచి కాదు.. టాలీవుడ్ నుంచి నాగార్జున, ఇతర ఇండస్ట్రీలనుంచి శృతిహాసన్, ఉపేంద్ర, పూజా హెగ్డే, రెబా మౌనిక జాన్, సత్యరాజ్ అలాగే బాలీవుడ్ నుంచి సైతం అమీర్ ఖాన్ ఈ సినిమాలో భాగం కివడంతో సినిమాపై నెక్స్ట్ లెవెల్ లో హైప్ క్రియేట్ చేశాడు లోకేష్ కనకరాజ్. అంతేకాదు.. ఆగస్టు 14న సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో.. సినిమాపై మరింత హైప్ పెంచేందుకు ప్రమోషన్స్‌లోనూ జోరు చూపిస్తున్నారు. మరో పక్క.. అదే రోజున రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 సినిమా విషయంలో మాత్రం ఈ రేంజ్ ప్రమోషన్స్ జరగడం లేదు.
ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని బ్లాక్ చేస్తుందనే రేంజ్‌లో టాక్ వినిపిస్తున్నా.. టాలీవుడ్‌లో మాత్రం సినిమా ప్రమోషన్స్ మచ్చుకైనా లేదు. వార్ 2 సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని మర్చిపోయిందంటూ అభిమానుల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంత బడా హీరో అన్న సంగతి తెలిసిందే.. మరి తెలుగులో కూడా కలెక్షన్స్ రావాలి కదా.. ఇక్కడ ఎందుకు ప్రమోషన్ చేయడం లేదంటూ ఫ్యాన్స్ వార్ 2 టీమ్‌ను ప్రశ్నిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రమోషన్స్ పై వార్ 2 ఎందుకు ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదనేది క్వశ్చన్ గా మారింది. ఈ క్రమంలోనే.. సోషల్ మీడియాలో వార 2 వర్సెస్ కూలి అంటూ జరిగిన పోలింగ్ అన్నిటిలోనూ.. దాదాపు కూలీనే ముందడుగులో ఉండడం విశేషం. దీన్నిబట్టే వార్ 2 సినిమా రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో డిసప్పాయింట్మెంట్లు మిగిల్చిందని క్లారిటీ వచ్చేసింది. మరి ఇప్పటికైనా వార్ 2 మేకర్స్.. మేల్కొని కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ప్రమోషన్స్ చేస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తారా.. లేదా కూలీనే విన్నార్‌గా నిలబెడతారా అనేది వేచి చూడాలి. ఇక అసలైన రిజల్ట్ రావాలంటే మాత్రం సినిమా రిలీజై ఫస్ట్ టాక్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.