కూలి రిలీజ్.. అక్కినేని ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్‌ల‌లో శివ ఒకటి. ఆర్జివి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా 1990లో రిలీజ్ అయిన టాలీవుడ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డును లికించింది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తయిన క్ర‌మంలో తాజాగా నాగార్జున ఇంట్రెస్టింగ్ విష‌యానిషేర్ చేసుకున్నాడు. శివా రోజులను గుర్తు చేసుకుంటూ తెలుగు సిని చరిత్రలో అతిపెద్ద హిట్గా ఇది నిలిచిపోతుందని నాన్నగారు చెప్పారు అంటూ ఆ పోస్ట్‌లో వివరించాడు.

ఇక అప్పట్లో సినీ ప్రియులను ఓ రేంజ్‌లో ఆకట్టుకునే సినిమా మళ్లీ థియేటర్లలో ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్లుగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే ఎలా ఫీల్ అవుతారు అనే ఆలోచన నాగార్జునకు వచ్చిందట. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పేందుకు నాగార్జున మంచి ప్లానే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు శివ మూవీ చూసే అవకాశం త్వరలోనే రానుంది. మొట్టమొదటిసారి ఫోర్కే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం సినిమాను వీక్షించే అవకాశం అభిమానులకు దక్కనుందనే విషయాన్ని స్వయంగా నాగార్జున వివరించారు.

Prime Video: Shiva

అన్నపూర్ణ స్టూడియోస్‌ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన క్ర‌మంలో అభిమానులకు గుడ్ న్యూస్ అంటూ వివరించిన ఆయన.. శివ సినిమా అనౌన్స్మెంట్‌తో పాటు.. రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలి సినిమా రిలీజ్ రోజునే బిగ్ సర్ప్రైజ్‌ను ప్లాన్ చేశారు. అదే రోజు థియేటర్‌లో శివ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. దీంతో.. కూలి సినిమాను చూసే నాగ్ ఫ్యాన్స్‌కు డబల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. శివా రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నాగార్జున ట్విట‌ర్ వేదికగా పేర్కొన్నాడు. ఇది చూసి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కంగ్రాట్యులేషన్స్ శివ టీమ్ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరి పోస్టులు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.