కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కూలీ. తమిళ్ పాపులర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక.. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగిటివ్ షేడ్స్‌లో మెరవనున్నాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే, రెబ్బ మౌనిక జాన్, మలయాళ యాక్టర్ సౌబిన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు మెరవనున్నారు.
ఇక సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. సెన్సార్ కార్యక్రమాల్ని కూడా తాజాగా పూర్తి చేసుకుంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ వేగవంతం చేశారు టీం. ఈ క్రమంలోనే అమెరికా, ఆస్ట్రేలియాలో కూలీ క్రేజీ రికార్డును అందుకొనుందని తెలుస్తుంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే నార్త్ అమెరికాలో భారీ బుకింగ్స్ జరిగాయి. ఈ ప్రీ సేల్స్ ప్రారంభమైన కొద్ది రోజులకే సినిమా రికార్డు లెవెల్లో వసూళ్లను రాబట్టిందని చెబుతున్నారు.
అమెరికా, కెనడాలో సినిమాకు భారీ వసూలు నమోదవుతుండడం విశేషం. ఇంకా పది రోజుల వ్యవధి ఉండగానే.. ఈ లెవెల్లో కలెక్షన్లు వస్తున్నాయంటూ సినిమాను అమెరికాలో రిలీజ్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమా అఫీషియల్ గా వెల్లడించింది. ఇక ఈ సినిమా ఆస్ట్రేలియాలో కూడా భారీ కలెక్షన్లను దక్కించుకుంటుంది. సినిమా ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే.. 1 లాక్.. ఆస్ట్రేలియన్ డాలర్లను సొంతం చేసుకోవడం విశేషం. ఇంకా పదిరోజుల్లో ఉన్న క్రమంలో రికార్డ్ లెవెల్‌లో కలెక్షన్లు నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది కూలీ.