నా ఐటెం సాంగ్ చేస్తూ పిల్లలు అన్నం తింటున్నారు.. తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్న‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. ప్రస్తుతం అడపా దడపా తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తూ బాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఈవెంట్‌లో సందడి చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ఆడియన్స్‌కు సినిమాలు గుర్తుండకపోవచ్చు. కానీ.. సాంగ్స్ మాత్రం మర్చిపోరంటూ కామెంట్లు చేసింది.

Aaj Ki Raat Song: 'स्त्री 2' का पहला गाना रिलीज, 'आज की रात' में तमन्ना ने  दिखाए लटके-झटके - stree 2 first song aaj ki raat released Tamannaah Bhatia  mesmerizing dance moves

ప్రస్తుతం తమన్నా హీరోయిన్గా కంటే స్పెషల్ సాంగ్స్‌లోనే ఎక్కువగా మెరుస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా తాజాగా ఆజ్ కి రాత్ అంటూ స్త్రీ 2 మూవీలో చిందేసింది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. నేను ప్రాజెక్టు సైన్ చేసేటప్పుడు దాని ద్వారా నాకు వచ్చే డబ్బుల గురించి కాదు.. నేను చేస్తున్న పని ఆడియన్స్‌పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని గురించి ఆలోచిస్తానంటూ వివరించింది.

పాట, నటన, సినిమా ఇలా.. ఏదైనా సరే నేను చేస్తున్న పని లైఫ్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందా.. లేదా.. అనేది చూస్తాను అంటూ చెప్పుకొచ్చిన తమన్నా.. ఇటీవల చాలామంది తల్లులు నాకు ఫోన్ చేసి మరీ ఆజ్ కి రాత్‌ సాంగ్.. పెడితేనే మా పిల్లలు ఆహారం తింటున్నారు అని చెప్పారు.. ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అంటూ కామెంట్లు చేసింది. ఎందుకంటే పిల్లలకు పోయెట్రీ అర్థం కాకపోవచ్చు కానీ.. మ్యూజిక్ ని వాళ్ళు వింటారు.. ఎంజాయ్ చేస్తారు అందుకే అన్నం తింటున్నారని తమన్న వివరించింది. ప్రస్తుతం తమన్న తన ఐటెం సాంగ్ ను చూసే పిల్లలు అన్నం తింటున్నారు అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.