ఒకప్పుడు టాలీవుడ్ యాంకర్ గా ఉదయభాను బుల్లితెరను ఏలేసింది. టెలివిజన్ క్వీన్ ఆఫ్ యాంకర్‌గా దూసుకుపోయింది. తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. ఇటీవల మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. చిన్నతనం నుంచి డ్యాన్స్, యాక్టింగ్ పై ఆసక్తితో.. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. 1994లో మొదటిసారి మ్యూజిక్ షో హోస్ట్గా వ్యవహరించింది. తన స్పాంటేనియస్ టాక్, ఎనర్జీ, కామెడీ టైమింగ్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని ఒక ప్రత్యేక ప్యాన్ బేస్ దక్కించుకుంది.
యాంకరింగ్ తో పాటు బుల్లితెరపై సీరియల్స్, వెండి తెరపై స్పెషల్ సాంగ్స్ చేస్తూ హీరోయిన్లతో సమానమైన పాపులారిటీ దక్కించుకుంది. కెరీర్ పిక్స్ లో ఉన్న టైంలో పెళ్లవడం, ఇద్దరు పిల్లలు పుట్టడం అదే టైంలో.. సుమా, శ్రీ ముఖి, లాస్య, రష్మీ, అనసూయా, ప్రదీన్, రవి అంటూ ఇలా యాంకర్లుగా మల్టిపుల్ ఆప్షన్స్ రావడంతో ఉదయభాను కెరీర్ కాస్త డల్ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ సంచనంగా మారాయి. కొందరు యాంకర్లు ఓ సిండికేట్‌గా మారి నాలాంటి వాళ్ళకి ఛాన్సులు లేకుండా చేస్తున్నారంటూ ఆమె ఎమోషనల్ అయింది. యాంకర్ గా కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉన్న సమయంలో.. చాలా హిట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వదిలేసుకున్నానని.. అందులో అత్తారింటికి దారేది సినిమా కూడా ఒకటి అంటూ ఉదయభాను చెప్పుకొచ్చింది.
లీడర్ మూవీ లో స్పెషల్ సాంగ్ చూసి.. త్రివిక్రమ్ గారు జులాయిలో టైటిల్ సాంగ్ కి నన్ను తీసుకున్నారని.. తర్వాత అత్తారింటికి దారేది మూవీలోను నాకు స్పెషల్ సాంగ్ అవకాశం వచ్చిందని.. పవర్ స్టార్ సినిమాలో సాంగ్ అంటే చాలా ఆనందపడ్డా కానీ.. అది పార్టీ సాంగ్ అని.. నాతో పాటు మరికొందరు హీరోయిన్స్ ఉంటారు అని తెలియడంతో డిసప్పాయింట్ అయ్యా. నేను అంతగా హైలైట్ అవ్వను అనిపించింది. అందుకే పవన్ మూవీని సునీతంగా రిజెక్ట్ చేశా అంటూ ఉదయభాను వివకించింది. బన్నీ మూవీకి ఎస్ చెప్పినా ఆమె.. పవన్ మూవీ కి నో చెప్పడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. గతంలో ఆమె ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.