విశ్వంభర పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ పక్కా..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసార ఫేమ్ మ‌ల్లిడి వ‌శిష్ఠ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ విశ్వంభ‌ర. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ప్రొడ్యూసర్లుగా సంయుక్తంగా నిర్మించిన ఈ సోషియా ఫాంటసీ డ్రామా ఇప్పటికే రిలీజ్ ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ అంతా ఆశ‌క్తి చూపుతున్నారు. ఇలాంటి క్రమంలో.. చిరంజీవి విశ్వంభర అప్డేట్.. అలాగే సినిమా ఇంత‌లా ఆలస్యానికి గల కారణాలు స్పెషల్ వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. ఇక ఈ వీడియోలోనే కొత్త రిలీజ్ డేట్ పై కూడా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

రేపు ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే క్రమంలో.. ఫ్రీ సెలబ్రేషన్స్ భాగంగా ఈ వీడియో ద్వారా చిరు సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ముందుకు రావడానికి కారణం.. చాలామందికి విశ్వంభరపై ఉన్న సందేహాలు. విశ్వంభర ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయంలో మీ సందేహాలు స‌మంజ‌స‌మే అన్ని నేను భావిస్తున్న. ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ , గ్రాఫిక్స్ లపై ఆధారపడి ఉంది. ఈ క్రమంలోనే సినిమాను ఆడియన్స్‌కు అత్యుత్తమంగా అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం అవుతుంది.

ఎలాంటి విమర్శలకు చోటు ఇవ్వకూడదని సినిమా విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. విశ్వంభర గురించి మాట్లాడాలంటే ఈ సినిమా ఒక అద్భుతమైన కథతో రూపొందింది. చందమామ కథలా సాగిపోయే అందమైన స్టోరీ. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్‌ను సినిమా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే మూవీ గ్లింప్స్‌ ఈరోజు సాయంత్రం 6:06కి రిలీజ్ చేస్తున్నాం. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నా. విశ్వంభ‌ర‌ అందరికీ ఇష్టమైన 2026 సమ్మర్లో రిలీజ్ అవుతుంది. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి అంటూ చిరంజీవి వీడియోని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట‌ వైరల్‌గా మారుతుంది.