మహేష్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. మరికొద్ది గంటల్లో గుడ్ న్యూస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెల‌కొంది. ఇక సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ అయినా వస్తే బాగుండన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. మహేష్ పుట్టినరోజుకు ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదంటూ టాక్ వైరల్ గా మారుతుంది. కానీ.. ఘట్టమనేని ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ మాత్రం రేపు 11:17 నిమిషాలకు రివీల్‌ చేయనున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

SSMB 29: Mahesh Babu fans request for updates as other biggies dominate  headlines

అసలు మ్యాటర్ ఏంటంటే.. మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ ఎప్పటి నుంచే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే ఆమె కూడా అదిరిపోయే కటౌట్ తో ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు మహేష్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా సితార ఘ‌ట్ట‌మ‌నేని ఫస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ ను మహేష్ అఫీషియల్ గా ప్రకటించనున్నాడట. కచ్చితంగా రేపు 11:17 నిమిషాలకు ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేయనున్నారంటూ టాక్‌ వైరల్‌గా మారుతుంది.

Mahesh Babu and Namrata Shirodkar's birthday wish for their 'little love'  Sitara - India Today

ఇక.. మహేష్ సినిమాల అప్డేట్‌తో పాటు.. సితారకు సంబంధించిన ఏదైనా అప్డేట్ మహేష్ బాబు షేర్ చేసుకుంటే బాగుండంటూ.. ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆమె ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్మెంట్ రేపు రిలీజ్ చేయనున్నారని తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుని టాలీవుడ్ సూపర్ స్టార్ గా తిరుగులేని సంపాదించుకున్నాడు మ‌హేష్‌. నెక్స్ట్ మహేష్ వారసురాలిగా అడుగుపెట్టనున్న సితార సైతం తండ్రిలా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం ఎంతో.. రేపు ఎలాంటి గుడ్ న్యూస్ తో మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నాడో చూడాలి.