2025: ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ కళ్లగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!

2025లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తాజాగా రివీలైంది. ఐఎండిబి సమాచారం ప్రకారం.. విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రేంజ్‌లో హైయెస్ట్ కలెక్షన్లు మరే సినిమా టచ్ చేయలేక పోయింది. భారతదేశంలోనే కాదు విదేశాల్లోనే సినిమాకు మంచి రెస్పాన్స్ ద‌క్కింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా.. రూ.130 కోట్ల బడ్జెట్‌తో వ‌చ్చి ప్రపంచవ్యాప్తంగా రూ.808.70 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన సినిమాల లిస్టులో నంబర్ 1గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత అతి తక్కువ బడ్జెట్ తో తెర‌కెక్కిన సైయారా సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది.

Sankranti ki Vastu Naam

చాలా వారాల పాటు దియేటర్లో నిరంతరాయంగా ఆడిన ఈ సినిమా.. మొదట్లో మంచి కలెక్షన్ల కొల్లగొట్టిన.. వార్ 2, కూలి సినిమాల రిలీజ్ క్రమంలో వసూలు నెమ్మదించాయి. అలా ఈ ఏడది హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాల్లో సైయారా 2వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ర‌రూ.542.40 కోట్ల వసూళ్లు దక్కాయి. రజనీకాంత్ నటించిన కూలి సినిమా ఈ లిస్టులో 3వ‌ స్థానాన్ని దక్కించుకుంది. రిలీజైన 9 రోజుల్లో ఏకంగా రూ.441.30 కోట్ల బస్సులను సొంతం చేసుకుంది. ఇక కూలితో పోటీగా రిలీజ్ అయిన వార్ 2 ఈ లిస్టులో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ కారణంగా కాస్త వెనుకబడింది.

L2: Empuraan | Rotten Tomatoes

ఇటీవల రూ.300కోట్ల మార్క్ దాటి థియేటర్లలో కొనసాగుతుంది. ఫుల్ ర‌న్‌లో సినిమా ఎలాంటి కలెక్షన్లు కొల్లగొట్టి ఎన్నో స్థానాన్ని దక్కించుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్లకు పైగానే కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. అది తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమా ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన టాలీవుడ్ సినిమాగా నిలిచింది. అత్యంత భారీ బడ్జెట్ తో తరికెక్కిన హౌస్‌ఫుల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.292 కోట్ల వసూళ్లను సొంతం చేసుకొని 5వ ప్లేస్ లో నిలిచింది. అలాగే మోహన్ లాల్ యంపురాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.268 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి 7వ స్థానంలో.. అమీర్ ఖాన్ సీతారే జామీన్ పర్ సినిమా రూ.266 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి 8వ స్థానంలో నిలిచాయి.