డాగ్ లవర్స్ కు ఆర్జివి మైండ్ బ్లాకింగ్ కౌంటర్.. షాకింగ్ వీడియో..!

టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా సంచ‌ల‌న‌మే. ఇక‌ తాజాగా సుప్రీంకోర్టు వీధి కుక్కల వివాదం పై ఆయన రియాక్ట్ అవుతూ మ‌రోసారి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారుతున్నాయి. ఆర్జీవి ఎక్స్ వేదికగా వీడియోలు పోస్ట్ చేసి.. దాని కింద కుక్కల ప్రేమికులందరికీ సుప్రీంకోర్టు తీర్పుపై గగ్గోలు పెడుతున్న వారికి.. ఈ వీడియో అంటూ క్యాప్షన్ జోడించాడు. నడిబొడ్డున.. పగలు వీధి కుక్కలు నాలుగేళ్ల బాలుడిని ఎలా చంపేసాయో చూడండి అంటూ మండిపడిన ఆర్జీవి.. సుప్రీంకోర్టు ఇటీవల వీధి కుక్కలను తరలించాలని ఇచ్చిన ఆదేశాల క్రమంలో జంతు ప్రేమికుల విమర్శలపై మండిపడ్డాడు.

ఢిల్లీలో వీధి కుక్కల తరలింపు పై సుప్రీంకోర్టు ఆదేశాలను సినీ సెలబ్రిటీ ఎంతో మంది తప్పు పట్టారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. జాన్వీ కపూర్ , వరుణ్ ధావన్, రవీనా టాండన్ లాంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఖండిస్తూ వీడియోని షేర్ చేసుకున్నారు, అలాగే యాక్టర్ జాన్ అబ్రహం అయితే.. సిజిఐ జస్టిస్.. బిఆర్ గవాయికి ఒక అభ్యుర్ధ‌న‌ను పంపించాడు. ఆదేశాలను సమీక్షించాలని ఆయన వెల్లడించాడు .తన లేఖల జాన్ అబ్రహం వీధి కుక్కలు కమ్యూనిటీ డాగ్స్ అని.. ఢిల్లీ పౌరులే అని చెప్పుకొచ్చాడు. హీరోయిన్ సదా సైతం సుప్రీంకోర్టు తీర్పు పై కంటతడి పెట్టుకుంది.

వీరందరికీ ఆర్జీవి ట్విట్ ద్వారా షాకింగ్ కౌంటర్ వేశాడు. ఇక ఈ ట్విట్లో ఓ హృదయ విదార‌క వీడియోని షేర్ చేసుకున్నాడు. నాలుగేళ్ల బాలుడు వీధుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో మూడు వీధి కుక్కలు అతనిపై దాడి చేసి చంపేసిన ఇన్సిడెంట్ సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ బయానక వీడియోను ఆయన ట్విట్ చేస్తూ.. ఇది కుక్కల సమస్య పై.. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి అంటూ వివరించాడు. సుప్రీంకోర్టు తీర్పు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వీధి కుక్కలను శాశ్వతంగా వాటి ఆశ్రయాలకు తరలించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జంతు సంక్షేమ సంస్థలు, జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరాలు వెల్లడించారు. కుక్కలను తరలించడం అమానవీయం.. ఆచరణా సాధ్యం కాదంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ వీడియోలో రియాక్ట్ అయ్యారు. ప్రజల భద్రత, ముఖ్యంగా చిన్నారుల భద్రత.. వీధి కుక్కల సమస్య ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే చాలామంది ఆర్జీవికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆయన చెప్పినవి కూడా వాస్తవాలేనంటూ వివరిస్తున్నారు.