ఇండియాలో యూట్యూబ్ హవా షురూ.. ఈ నయా ఫ్యూచర్ స్పెషాలిటీస్ తెలిస్తే షాకే..!

ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చేతిలో ఫోన్ లేని మ‌నిషి ఉండట్లేద‌న‌టంలో అతిశ‌యోక్తి లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక‌ ఎక్కువ మంది ఉపయోగించే యాప్ ఏదైనా ఉందంటే దానికి యూట్యూబ్ అనే ఆన్సర్ క‌చ్చితంగా మొద‌ట వ‌రుస‌లో వినిపిస్తుంది. ఇక యూట్యూబ్ ఎంతమందికి మంచి ఇన్కమ్ సోర్స్‌గాను ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూట్యూబ్ క్రియేటర్ గా చాలా మంది త‌మ టాలెంట్ చూపించేందుకు సిధ్ధం అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో యూట్యూబ్ చిన్న, మధ్య స్థాయి యూట్యూబ్ క్రియేటర్లకు ఒక శుభవార్త చెప్పింది. కంటెంట్ క్రియేటర్ ఛానల్ వ్యూస్‌ పెంచుకునేందుకు.. కొత్త ఆడియన్స్ను అట్రాక్ట్ చేసుకునేందుకు.. సరికొత్త ఛాన్స్ క్రియేట్ చేస్తుంది.

YouTube Rolls Out 'Hype' Feature in India to Boost Small Creators | Tech  News - News9live

500 నుంచి 5 లక్షల మధ్య సబ్స్క్రైబర్స్‌ ఉండడం ద్వారా క్రియేటర్స్‌కు ప్రయోజనం చేకూరేలా కొత్త ఫీచర్‌ను క్రియేట్ చేసింది. అదే youtube. హైప్. ఈ ఫీచర్‌తో త‌మ‌కు ఇష్టమైన వీడియోలను హైలెట్ చేస్తూ ఆడియన్స్‌లో హైప్‌ పెంచడానికి ఈ ఫ్యీచర్ ఉపయోగపడుతుంది. ఇది కచ్చితంగా చిన్న యూట్యూబర్లకు మంచి ప్రయోజనం చేకూరుస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫ్యీచర్ వ్యూస్ పెంచుకోవడానికి.. ప్రత్యేకంగా, పరోక్షంగా ఎంతగానో సహకరిస్తుంది. వీడియో పబ్లిష్ అయ్యిన ఏడు రోజుల్లో వ్యూవర్స్‌లో హైప్ క్రియేట్‌ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

YouTube Announces 5 Features for Premium Subscribers

ఈ ఫ్యీచర్ ద్వారా వీడియోకు పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్స్ వల్ల టాప్ 100 హైన్‌ వీడియోల లీడర్ బోర్డులో ర్యాంక్ ద‌క్కించుకునే ఛాన్స్ ఉంది. కాగా.. చిన్న యూట్యూబ్ క్రియేటర్స్‌కు సైతం కంటెంట్ వైరల్ చేసేందుకు సమానమైన అవకాశాలు కల్పించడానికి.. తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లకు ఎక్కువ బోనస్ పాయింట్లు అందుకనేందుకు వీటితో అవకాశం ఉంటుంది. తక్కువ సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్న ఛానళ్లకు ఈ ఫ్యీచర్ ద్వారా బోన‌స్ పాయింట్లు మరింత లాభాన్ని చేకూరుస్తాయి. ఉన్నత స్థానం పొందిన వీడియోలు హోమ్ ఫీడ్ లో ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక క్రియేటర్ వారానికి మూడు వీడియోలను ఫ్రీగా హైప్‌ చేసుకొనేలా దీన్ని క్రియేట్ చేశారు.