టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. బాబి డియోల్, సునీల్, నాజర్, అయ్యప్ప శర్మ, అనుపమ్ ఖేడ్కర్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమాకు జ్యోతి కృష్ణ, క్రిష్ సంయుక్తంగా దర్శకులుగా వ్యవహరించారు. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్గా.. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న సినిమా కావడం.. ఆయన కెరీర్‌లోని ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ కావడంతో.. ఈ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
థియేటర్స్ వద్ద పవన్ అభిమానుల రచ్చ మొదలైంది. గత రాత్రి ప్రీమియర్ షోస్‌తో మొదలైన సందడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పవన్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. ఈనెల తర్వాత పవర్ స్టార్‌లో సరికొత్త గ్రేస్ చూసామని.. ఐదేళ్ల పాటు సినిమా కంటిన్యూస్గా షూట్ జరిగినా.. ఎక్కడ లుక్ లో కాస్త కూడా తేడా రాకుండా పవన్ తన క్యారెక్టర్‌ను బ్యాలెన్స్ చేశాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినిమాల్లో కొన్ని సన్నివేశాల పట్ల నెగటివ్ టాక్ కూడా వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా సినిమాలో సెకండ్ హాఫ్ మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఎడిటింగ్ సరిగ్గా లేదని.. సినిమా స్లోగా ఉందని.. కీలక సన్నివేశాల్లో విఎఫ్ ఎక్స్ వర్క్ అసలు బాగోలేదు.. చాలా సెన్సిటివ్ గా ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
డబ్బింగ్ వర్క్ కూడా సరిగ్గా లేదంటూ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో సీజ్ వర్క్ ప్రారంభించారట. ఎక్కడైతే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయో.. వాటిని సినిమా నుంచి తొలగించి సెకండ్ హాఫ్ ఎడిట్ చేసి.. లేటెస్ట్ వెర్షన్ నెక్స్ట్ షోలో నుంచి థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు టాక్. మరి.. లేటెస్ట్ వర్షన్ రివ్యూ ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే.. ఇప్పటికే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్లో సందడి చేయనున్నాడు.