పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఈవారం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాలో.. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా.. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా .. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా రూపొందిన ఈ పిరియాడిక్ హిస్టారికల్ మూవీ పై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ మరింత ఆసక్తి చూపుతున్నారు.
ఇలాంటి క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ సైతం సినిమా హైప్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రీమియర్ షోస్, టికెట్ ధరల పెంపుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. హరిహర విరమల్లు సినిమా లెక్కలు ప్రస్తుతం అందరికి షాక్‌ను కలిగిస్తున్నాయి. పవన్ తాజాగా నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.126 కోట్లు కాగా.. ఈ సినిమాకు తెలంగాణ నైజాంలో.. రూ.37 కోట్లు, రాయలసీమలో రూ.16.50 కోట్లు, మిగిలిన ఆంధ్ర మొత్తం కలుపుకొని రూ.13.50 కోట్ల వరకు జరుపుకుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో మొత్తంగా కలుపుకొని రూ.126 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే.. వీరమల్లు బ్లాక్ బస్టర్ కావాలంటే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.127 కోట్ల పైగా షేర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. కాగా.. వీరమల్లు టార్గెట్‌ను సులువుగా రీచ్ అవుతాడంటూ ట్రేడ్ వర్గాలు, అభిమానుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పవన్‌కు ఉన్న క్రేజ్ వీరమల్లు పై ఉన్న మానియాతో ఈ సినిమా టార్గెట్‌ను రీచ్ అవడం పెద్ద కష్టమేమీ కాదంటూ.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.