హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు పార్ట్ 2 టైటిల్ ఇదే.. ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ప‌క్కా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంట‌గా నటించిన హరహర వీరమల్లు సినిమా తాజాగా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై ఆడియ‌న్స్‌ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అన్నిచోట్ల పాజిటీవ్ టాక్ ద‌క్కించుకున్న వీరమల్లు.. పవన్ కెరీర్‌లోనే మొట్ట మొదటి పిరియాడికల్ హిస్టారికల్ మూవీ కావడం విశేషం. ఈ క్రమంలోనే సినిమాపై రిలీజ్‌కు ముందు నుంచే ఆడియన్స్‌లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇక అంచ‌నాల‌కు తగ్గట్టుగానే సినిమా రిలీజై ఆకట్టుకుంది.

మొగల్ చక్రవర్తి.. ఔరంగాజేబ్ రోల్లో బాబీ డియోల్ మెరిసారు. ఇక.. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. 16 వ శతాబ్దం మొగల్ సామ్రజ్యం ప్రతిబింబించేలా భారీ సెట్స్ డిజైన్ చేసి మరి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ దర్బార్ సెట్‌లో ఔరంగ జేబ్‌.. వీరమల్లు మధ్య వచ్చే కీలక సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. కాగా.. మూవీ రిలీజ్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్‌కు మరో శుభవార్త వినిపించింది. హరిహర వీరమల్లు పార్ట్ 2కి సంబంధించిన టైటిల్ రివీల్ అయ్యింది.

వీరమల్లు లో కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు ఢిల్లీ బయలుదేరగా.. అడ్డుకునేందుకు ఔరంగాజే సిద్ధమయ్యాడు. ఇక వీరమల్లు, ఔరంగ‌జేబు కలుసుకోవడంతోనే మూవీ ముగిసింది. అంతేకాకుండా.. చివర్లో యుద్ధ భూమి అనే నేమ్ కార్డుతో అసలైన యుద్ధం ఇప్పుడే చూడాలంటూ.. పార్ట్ 2 అంచ‌నాలను రెట్టింపు చేశారు మేకర్స్. హైందవ ధర్మ పరిరక్షణ కోహినూర్‌ను రక్షించుకునే సమయంలో ఔరంగజేబుతో జరిగే వీరమల్లు పోరాటం ఆడియన్స్‌కు చూపించేందుకు పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్నారు టీం.