పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే పవన్ అభిమానులతో పాటు.. సాదరణ ఆడియన్స్ లోను మంచి హైప్ నెలకొంది. ఇక పవన్ ఎప్పుడు తన సినిమా ప్రచారాలకు దూరంగానే ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాంటిది తాజాగా వీరమల్లు సినిమా కోసం పవన్ రంగంలోకి దిగడం ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
పవన్.. డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత ఆయన నుంచి వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. అంతేకాదు.. పవన్ స్వయంగా ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి సినిమా గురించి మాట్లాడడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అయితే.. తాజాగా పవన్ ఈ ప్రెస్ మీట్‌లో భాగంగా సినిమాకు సంబంధించిన స్టోరీ రివిల్ చేశాడు. ఆయన మాట్లాడుతూ హరిహర విరమల్లు షూటింగ్‌లో ఎదురైనా ఒడిదుడుకులు.. యూనిట్లో ఒక్కొక్కరి కష్టం గురించి ప్రస్తావించాడు. నిర్మాత రత్నం గారి కోసం ఈ ప్రెస్ మీట్‌కి వచ్చా. ఆయన సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు. ప్రస్తుతం సినిమాలకు నేను టైం కేటాయించలేకపోయిన.. అన్నింటిని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు. కేవలం మూవీ క్లైమాక్స్ కోసమే 57 రోజుల సమయం పట్టింది. అంత కష్టంతో కూడుకున్న సీన్స్ అవి అంటూ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ క్రిష్ గారు నా దగ్గరకు చాలా అద్భుతమైన కాన్సెప్ట్‌తో వచ్చారు. ఈ సందర్భంగా క్రిష్‌కి నా ధన్యవాదాలు చెబుతున్నా అంటూ.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశాడు.
కృష్ణ తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూరు వజ్రం హైదరాబాద్ సుల్తానుల దగ్గరకు ఎలా చేరుకుంది.. దాని ప్రయాణం ఎటు నుంచి ఎటు సాగిందనే కథతో స్టోరీ తెరకెక్కిందంటూ వివరించాడు. ఇక ఈ సినిమాకు కీరవాణి తన మ్యూజిక్‌తో ప్రాణం పోసారని వివరించాడు. ఇక కొన్ని కారణాలతో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత.. జ్యోతి కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చాలా సత్తా ఉన్న డైరెక్టర్. ప్రతిది విజువలైజేషన్ చూస్తాడు. మనోజ్ పరమహంసతో కలిసి ఆయన అద్భుతంగా చేశారు. ఇప్పటికీ జ్యోతి కృష్ణ, ప్రొడ్యూసర్ ఏం రత్నం లాంటివారు సినిమా కోసం నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ బాధ్యత నిధి అగర్వాల్ భుజాలపై వేసుకొని ఇంటర్వ్యూలలో కష్టపడుతుంది. ఆమెను చూస్తే నాకే సిగ్గేస్తుంది. సినిమాను అనాధలా వదిలేసాను అనే ఫీలింగ్ వస్తుంది. సినిమాను అలా నేను వదిలేయటం లేదని చెప్పేందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని.. పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.