” వీరమల్లు ” కలెక్షన్స్ పై జ్యోతి కృష్ణ రియాక్షన్.. 3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడా అంటూ.. అభిమానులంతా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు గ్రాండ్ లెవెల్లో రిలీజై.. బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఇక ప‌వ‌న్ క్రేజ్‌తో ఫ‌స్ట్ డే మూవీకి మంచి క‌లోక్ష‌న్‌లు వ‌చ్చినా.. రెండో రోజు మాత్రం భారీ డ్రాప్ ను ఎదుర్కొంది ఇక ప్రజంట్‌.. సినిమా ఏదైనా సరే రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే కలెక్షన్లను అఫీషియల్ గా నిర్మాణ సంస్థలు ప్రకటించడం ట్రెండ్ గా మారిపోయింది. అలాంటిది పవన్ వీరమల్లు సినిమాకు మాత్రం కలెక్షన్స్ ఎంత అనే దానిపై మేకర్స్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈనెల 23న ప్రీమియర్ షోస్ నుంచి ఓవర్సీస్ లో హరిహర వీరమల్లు కలెక్షన్స్ వ‌ర‌కు.. ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.

మూడు సార్లు సినిమా చూశారు.. మరో మూవీ చేస్తానని హామీ: డైరెక్టర్ | Director Jyothi  Krishna Speech Latest Hari Hara Veera Mallu Movie Event In Machilipatnam,  Deets Inside | Sakshi

ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యులో మూవీ క‌లోక్ష‌న్ పోస్ట‌ర్‌ల‌పై డైరెక్టర్ జ్యోతి కృష్ణకు ప్రశ్న ఎదురయింది. జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. పోస్టర్లు రిలీజ్ చేసిన అది కరెక్టా.. కాదా.. అనే చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ పలు సోషల్ మీడియా వెబ్సైట్లో రోజు ఏదో ఒక రకంగా కలెక్షన్లు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మేము సినిమా కలెక్షన్లపై ఎలాంటి పోస్టర్లు రిలీజ్ చేయలేదు. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని మాత్రం పోస్టర్ల ద్వారా చెబుతున్నాం అంటూ జ్యోతి కృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఇక వీరమల్లుకు.. సాక్‌నిల్క్ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం మూడో రోజు కలెక్షన్లు బాగానే వచ్చినట్లు తెలుస్తుంది.

మొదటి రోజు భారీ లెవెల్లో కలెక్షన్లు కొల్లగొట్టిన వీరమల్లు.. రెండో రోజు కేవలం రూ.8 కోట్లు మాత్రమే దక్కించుకుంది. అయితే మూడవరోజు వీరమల్లుకు రూ.9.87 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయట. దీన్నిబట్టి రెండో రోజు తో పోలిస్తే 23.25 శాతం ఆకీపేన్సి సినిమాకు పెరిగింది. అలా మొత్తంగా సినిమాకు మూడు రోజుల్లో రూ.65.8 కోట్ల వసూలు వచ్చాయి. ఇక ఆదివారం కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్లు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇప్పటివరకు వీర‌మ‌ల్లు వరల్డ్ వైడ్‌గా రూ.80 కోట్ల వసూళ్లు సాధించగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.60.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నాలుగవ రోజు గడిచేపాటికి.. రూ.100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.