గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా.. తాను శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించగా.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై సక్సస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. చరణ్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా మెరవనుండగా.. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాంధ్ శర్మ కీలకపాత్రలో మెరవనున్నారు.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 22న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వెలువడింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌నైతే ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గతంలో ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో రూపొందిన నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే చరణ్ కోసం సుకుమార్ ఈ కథ స్క్రిప్ట్ వర్క్‌ను ప్రారంభించేసాడట.
చరణ్‌కు చిన్న లైన్ కూడా వినిపించినట్టు.. అది అద్భుతంగా ఉండటంతో చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చరణ్ పెద్ది సినిమాను కంప్లీట్ చేసుకునే లోపు.. పూర్తిగా ఫుల్ స్టోరీని డెవలప్ చేసి చరణ్ కు వినిపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా.. ఏకంగా అమెరికాలో చరణ్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాడని న్యూస్ వైరల్‌గా మారుతుంది. తాజాగా.. టీం మొత్తాన్ని అమెరికాకు తీసుకువెళ్లి అక్కడ చరణ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై డిస్కషన్లు జరిపాడట. మరికొన్ని రోజుల్లో మొత్తం స్క్రిప్ట్‌ను సుకుమార్ లాక్ చేయనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ వివరాలను కూడా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.