ఏ.ఏం.రత్నకు ఆ గవర్నమెంట్ రోల్‌ ఫిక్స్ అయ్యిందా..అసలు మ్యాటర్ ఏంటంటే..?

ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోయిన వారిలో ఏ.ఎం. రత్నం మొదటి వ‌రుస‌లో ఉంటారు. సూర్య మూవీస్ బ్యానర్ పై రత్నం ప్రొడ్యూసర్ గా సినిమా వస్తుందంటే.. ఆ సినిమాకు నెక్స్ట్ లెవెల్లో హైప్‌ ఉండేది. శంకర్ తో భారతీయుడు, ఒకే ఒక్కడు, పవన్ కళ్యాణ్‌తో ఖుషి లాంటి సినిమాల వరకు ఎన్నో బ్లాక్‌ బస్టర్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా తిరుగులేని రేంజ్‌కు ఎదిగాడు ఏ.ఏం. రత్నం. కానీ.. తర్వాత కాలంలో వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్న క్రమంలో.. ప్రొడ్యూసర్‌గా గ్యాప్ ఇచ్చి.. బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో మరోసారి పూర్వ వైభవం అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇలాంటి క్రమంలో త్వరలోనే రత్నం ను ఓ ప్రభుత్వ పదవిలో చూడబోతున్నాం అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఏపీ ప్రభుత్వం రత్నం ను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియ‌మించాల‌ని భావిస్తుంద‌ట‌. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ పదవి ఎవరికి నియమించకపోవడం.. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, రత్నంకు మధ్యన ఉన్న క్లోజ్ నెస్ తో ఆయనకు ఈ పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఇక పవన్.. రత్నం కలయికలో ఖుషి, బంగారం లాంటి సినిమాలు తెర‌కెక్కయి. ఇక నిర్మాతగా దెబ్బతిన్న రత్నంకు ఎప్పటికైనా మరోసారి సినిమాకు ప్రొడ్యూస్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు.

ఎట్ట‌కేల‌కు అది వీర‌మ‌ల్లుతో తీరింది. కానీ.. ఆ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతున్న రత్నం మీద మోయలేని భారం పడిన సరే ఎక్కడ ఆయన వెనక్కు తగ్గలేదు. పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ ను దృష్టిలో పెట్టుకున్న రత్నం సినిమాకు ఎంత ఆలస్యమైన ఓపికగా ఎదురు చూశాడు. ఎన్నికల టైం లోను ఆయన తన వంతు సహాయం అందించాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రత్నం ను ఏపీఎఫ్డ్‌సి చైర్మన్‌గా నియమించాలని పవన్ భావిస్తున్నాడట. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి అడగ్గా అదే దిశగా.. పవన్ ఆలోచిస్తున్నారని.. అయన అఫీషియల్ గా ప్రకటించే వరకు వెయిట్ చేద్దాం అంటూ క్లారిటీ ఇచ్చాడు రత్నం. ఇంకో నెల రెండు నెలల్లో ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందట.