మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఉన్న సూపర్ స్టార్స్ టాప్ ఫై లిస్టులో కచ్చితంగా రామ్ చరణ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలాంటి మూమెంట్లో రాంచరణ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది.
రామ్ చరణ్ సాధారణంగా టాటూలు లాంటి వాటికి చాలా దూరంగా ఉంటాడు. కానీ.. ఆయన బాడీ మొత్తంలో ఒకే ఒక్క టాటూను వేయించుకున్నాడట. అది కూడా చాలా ఇష్టంగా వేయించుకున్నాడని.. ఎంతో స్పెషల్ అని తెలుస్తుంది. ఇంతకీ ఆ టాటు ఏదో కాదు. ఆయన వైఫ్ ఉపాసన పేరు. తనను ముద్దుగా చరణ్.. ఉప్సి అని పిలుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే చరణ్.. తన ఛాతిపై ఉప్సి అనే పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడట. ఇది చరణ్ కు చాలా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ కు మాత్రమే తెలుసట. ఇది ఓ సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు. చరణ్ కి ఉపాసన అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
తనలో సగమైన ఉపాసనను ఎంతగానో గౌరవిస్తాడని.. అంతే ప్రేమిస్తాడని.. ఈ క్రమంలోనే ఇష్టం లేకపోయినా తనపై చెరగని ముద్ర వేసుకోవాలి అని ఈ టాటు వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ ఆయన ఆ టాటూను బయటకు ఎక్స్‌పోజ్ చేయలేదు. అయితే.. ఇప్పటికే ఈ విషయం ఫలితాలు వార్తల్లో వైరల్ అయినా.. రాంచరణ్ కానీ, మెగా ఫ్యామిలీ కానీ.. దానిపై రియాక్ట్ కాలేదు. ఇక ఉపాసన మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే మెగా అభిమానుల సైతం ఉపాసనకు ఫిదా అయిపోయారు. ఈ అమ్మను ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ తెగ హైలెట్ చేసేస్తూ ఉంటారు మెగా ఫ్యాన్స్.