ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా ఒకటి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ నెటింట మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
కాగా తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వారి అంచనాలను మరింత పెంచేలా ఓ ఇంట్రస్టింగ్ ట్విట్ ను షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ సింగల్ పై లేటెస్ట్ అప్డేట్ ను పంచుకున్నాడు. ఈ సింగల్ పై థమన్ ఇచ్చిన హింట్.. ఫాన్స్ లో మరింత ఎక్సైట్మెంట్‌ను పెంచేసింది. ట్విట్టర్ వేదికగా ఒక గన్ ఎమోజి పెట్టి.. కల్ట్ అంటూ చిన్న పోస్టర్‌ను షేర్ చేసుకున్నాడు. దీంతో.. సినిమా ఫస్ట్ సింగిల్ కోసమే ఈ హింట్ ఇచ్చినట్లు.. ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ వచ్చే నెలలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట. దీనిపై.. ఇంకా అఫీషియల్ ప్రకటన రాకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఇది తెగ వైరల్ గా మారుతుంది.
ఇక డివీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక అఫీషియల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా.. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరవనున్నారు. శ్రీయ రెడ్డి, అర్జున్‌దాస్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలకపాత్రలో ఆకట్టుకోనున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో.. వేచి చూడాలి.