నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గేర్‌లో పరుగులు పెడుతోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న నాని, ‘దసరా’తో మాస్ ఇమేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. తాజాగా ‘హిట్ 3’ ద్వారా మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిశాయి. ఇంతలోనే నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టేశాడు. ‘దసరా’ సినిమాతో తనలోని మాస్ యాంగిల్‌ను బయటపెట్టిన నాని – అదే కాంబినేషన్‌లో మళ్లీ అడుగుపెడుతున్నాడు .
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ **‘ది ప్యారడైజ్’**గా ఖరారు చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కి అభిమానుల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది.ఈ సినిమా లో కథ కథనాలు ఆసక్తికరంగా ఉండనున్నట్లు టాక్. నానితో పాటు ఇందులో ఇద్దరు హీరోయిన్‌లు నటిస్తున్నారు. ఒకవైపు భాగ్యశ్రీ బోర్సే, మరోవైపు ఇటీవలే ‘డ్రాగన్’ సినిమాతో పాపులర్ అయిన కాయాదు లోహర్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కాయాదు లోహర్ ఈ సినిమాలో ఓ వేశ్య పాత్రలో నటించబోతుందట.
ఈ క్యారెక్టర్ చాలా లోతుగా, భావోద్వేగంతో నడిచే పాత్రగా ఉంటుందని టాక్ . గ్లామర్ తో పాటు సున్నితమైన ఎమోషన్స్‌కు ఈ పాత్రకు స్పేస్ ఉండబోతుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ. ఇది నాని పాత్ర కు కూడా మానవతా కోణాన్ని చూపించేలా ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి .ఇక నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అంటేనే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయినట్టు. ‘దసరా’ తరహాలోనే గ్రామీణ బ్యాక్‌డ్రాప్ , మాస్ పాత్రలు ఈ సినిమా కు హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి . త్వరలోనే ట్రైలర్ , టీజర్ వస్తే నాని మళ్లీ థియేటర్లలో రచ్చ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.