సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అడుగుపెట్టిన చాలా మంది ముద్దుగుమ్మలు సక్సెస్ అందుకునే క్రమంలో మ్యారేజ్ లైఫ్ దూరమవుతూ ఉంటారు. పెళ్లి చేసుకున్ని పిల్లలు కంటే అందం పోతుందేమో.. హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోతాయి అనే ఆలోచనలతో.. ముదురు వయసు వచ్చేవరకు వివాహానికి ఇష్టపడరు. మరి కొంతమంది అయితే అసలు వివాహమే చేసుకోకుండా ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా.. నాలుగు పదుల వయసులో వివాహం చేసుకొని పిల్లలను కన్నా హీరోయిన్లు కూడా ఉన్నారు.
కానీ.. తాజాగా మనం చెప్పుకోబోతున్న స్టార్ బ్యూటీ మాత్రం నాలుగు పదుల వయసు వచ్చిన ఇంకా వివాహం చేసుకోలేదు కానీ.. అమ్మడు ప్రెగ్నెంట్గా మారి కవలలకు జన్మనిచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. కన్నడ స్టార్ బ్యూటీ.. ట్రెడిషనల్ డ్యాన్సర్ భావన రామన్న తాజాగా షేర్ చేసుకున్న ఒక పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారుతుంది. తన లైఫ్‌కు సంబంధించిన ఓ కీలక అధ్యాయాన్ని ప్రారంభించినట్లు అఫీషియల్ గా షేర్ చేసుకుంది. తాను కవల పిల్లలకు జన్మనివ్వనున్నట్లు వెల్లడించింది. 1986లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఆకట్టుకుంది. ఇక భరతనాట్యంలోనూ అమ్మడు మంచి ప్రావిణ్యత పొందింది.
ఈ క్రమంలోనే మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను సైతం అందుకుంది. కాగా.. ఈ అమ్మడు నాలుగు పదుల వయసు మీద పడుతున్న ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. కానీ.. తాజాగా ఆమె తల్లి కావాలని నిర్ణయించుకుంది. మొదట్లో.. దీనికి వైద్యులు నిరాకరించినా.. చివరికి ఒక డాక్టర్ సహకారంతో ఐవీఎఫ్ ద్వారా ఫస్ట్ ఎటమ్ప్ట్‌లోనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కాగా.. ఇప్పుడు భావన 7 నెలల గర్భవతిగా ఉన్న క్రమంలోనే.. తాను కవల పిల్లలు ఆశిస్తున్నానని వివరించింది. ఈ విషయాన్ని స్వయంగా భావన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇది.. నా కొత్త చాప్టర్. నా 20, 30 వయసులో.. తల్లి కావాలని ఆలోచన నాకు లేనేలేదు. కానీ.. 47 ఏళ్ల తర్వాత.. అది నాలో స్ట్రాంగ్ విష్ గా మారింది. నా పిల్లలకు తండ్రి లేకున్నా.. వారు ప్రేమతో నిండిన ఇంట్లో ఉంటారు. త్వరలో ఇద్దరు చిన్న ప్రాణులు నన్ను అమ్మ అని పిలవనన్నారు. నాకు కావాల్సింది కూడా అదే అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకుంది.