సౌత్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్‌లో మక్కాం వేసిన సంగతి తెలిసిందే. అక్కడే పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ సత్తా చాటుకుంటున్నా ఈ ముద్దుగుమ్మ.. మరొ పక్క ప్రొడ్యూసర్‌గాను మారి సక్సెస్‌లు అందుకుంటుంది. తాజాగా.. శుభం సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన ఈ అమ్ముడు.. తానే ఫిమేల్ లీడ్ గా మా ఇంటి బంగారం అనే మరో సినిమాకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ తప్ప.. మరే అప్డేట్ ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇక సమంత సినిమాల విషయాలకంటే ప్రస్తుతం పర్సనల్ విషయాలతోనే హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.
గత కొంతకాలంగా ఈ అమ్మడు రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలం సింగల్ లైఫ్‌ని లీడ్ చేసిన శ్యామ్.. మళ్లీ ప్రేమలో పడిందని.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడమొర్రుతో అమ్మడు సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే సమంత రాజ్‌తో కలిసి చట్టబట్టలేసుకొని తిరుగుతున్న ఫొటోస్ వైతల్‌గా మారుతున్నాయి.
ఈ ఫొటోస్ చూసిన నెటిజైన్స్ సైతం ఇది కేవలం ఫ్రెండ్‌షిప్ కాదని.. వీరిద్దరి మధ్య మరేదో ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సమంత రెండో పెళ్లికి కూడా డేట్ ఫిక్స్ చేసేసారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఆగస్టులో వెళ్ల ఇద్దరి పెళ్లి జరుగుతుందంటూ వార్తలు వినిపించినా.. ఇప్పుడు అక్టోబర్ 6న సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. ఈ డేట్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.. కారణం సమంత, నాగచైతన్య అక్టోబర్ 6 న వివాహం చేసుకున్నారు. అయితే.. ఈసారి పెళ్లి మాత్రం ఎలాంటి హంగు, ఆర్పాటాలు లేకుండా చాలా సింపుల్ గా పలువురు సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరగనుందట. అయితే.. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే సమంత గాని, రాజ్ నిడుమొరు గాని అఫీషియల్ గా రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.