స్టార్ బ్యూటీ సమంత.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మడు మోస్ట్ పాపులర్ స్టార్ బ్యూటీగా.. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే.. సమంత ఇటీవల కాలంలో ఎక్కువ తన వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతుంది. గతంలో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పర్సనల్గా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. స్ట్రాంగ్ గా నిలబడింది. ఈ క్రమంలోనే కెరీర్‌పై పూర్తి దృష్టి సారించిన సమంత.. నటిగానే కాకుండా నిర్మాతగాను అడుగుపెట్టి సక్సెస్ అందుకుంటుంది.
తాజాగా తను ప్రొడ్యూసర్గా వ్యవహరించిన శుభం సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. తాజాగా ఈ అమ్మడు నార్త్ స్టార్ డైరెక్టర్‌లలో ఒకరైన రాజ్ నిడమోరుతో రహస్యంగా ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే వీళ్ళు ఇద్దరు కలిసి క్లోజ్ గా ఉన్న ఫొటోస్ అయితే ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక.. తాజాగా వీళ్ళిద్దరూ రెండో పెళ్లి కూడా అక్టోబర్ లో గ్రాండ్ లెవెల్లో జరుగుతుందంటూ న్యూస్ వైరల్ గా మారింది.
ఇలాంటి క్రమంలో మరోసారి వీళ్ళిద్దరూ కలిసి కెమెరా కళ్ళకు చిక్కారు. ఇద్దరు ఒకే కారులో రెస్టారెంట్‌కు వెళ్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇది చూసిన తర్వాత కొందరు త్వరలోనే రెండో పెళ్ళంటూ వచ్చిన వార్తలు నిజమేనని ఫిక్స్ అయిపోతే.. మరికొందరు మాత్రం ఇదంతా ప్రొఫెషనల్ రాపో అని.. వాళ్ళ మధ్యన మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది.. దాన్ని ఎందుకు ఇంతలా హైలెట్ చేస్తున్నారు.. ఎందుకు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ రియాక్ట్ అవుతున్నారు. ఈ రేంజ్ లో రూమర్లు వినిపిస్తున్న సమంత కాని.. రాజ్ కానీ ఎవరు ఈ వార్తలపై రియాక్ట్ కాలేదు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరికి సంబంధించిన లవ్, డేటింగ్ వార్తలు మరింత హాట్ టాపిక్ గా మారాయి.