వీరమల్లులో పవన్ కొరియోగ్రఫీ.. ఆ ఒక్క ఫైట్ కు 60 రోజులు.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!

దాదాపు మూడున్నర ఏళ్ల పాటు సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ఫైనల్ గా రిలీజ్ కోసం సిద్ధ‌మైంది. పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపుకు తెర ప‌డింది. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ సినిమాకు ప్రీమియర్ షోస్ కూడా పడుతున్న క్రమంలో ఆడియన్స్‌లో సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే ప్రొడ్యూసర్ ఏ.ఏం.రత్నం, డైరెక్టర్ జ్యోతి కృష్ణ, నిధి అగర్వాల్.. యాంకర్ సుమాతో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొని సందడి చేశారు. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. వీరమల్ల సినిమాలో ఆరు యాక్షన్స్ సీక్వెన్స్ లో ఉంటే అందులో ఒకటి పవన్ స్వయంగా డిజైన్ చేశారంటూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ వివరించారు.

ఒక సీన్ సీక్వెన్స్ షూటింగ్‌కే దాదాపు 60 రోజుల సమయం పట్టిందని.. సినిమాల్లో ఆరు యాక్షన్ ఎపిసోడ్‌ల‌లో ప్రతి ఫైట్‌లో పవన్ మార్షల్ ఆర్ట్స్‌ స్కిల్స్ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా వేటికవే ఒక ప్రత్యేక డిఫరెంట్ స్టైల్ లో ఉంటాయంటూ చెప్పుకొచ్చారు. వీటిలో ఒక ఫైట్‌.. మొత్తం సీక్వెన్స్ ప‌వ‌న్ కొరియోగ్రఫీ చేశారు. బ్రూస్లీ ఎంటర్ ది డ్రాగన్ సినిమా రేంజ్‌ను తలపించే హెవీ ఫైట్ అది. స్టాండింగ్ అవుట్ లుక్ తో డిజైన్ చేశారు. సినిమాల్లో ఈ ఫైట్ హైలెట్ గా నిలవనుంది అంటూ వివరించాడు.

Hari Hara Veera Mallu Team Interview with Suma | AM Ratnam | Nidhhi Agerwal  | Pawan Kalyan | TFPC - YouTube

ఈ ఒక్క ఫైట్‌ను 60 రోజుల పాటు షూట్ చేశామంటే జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చాడు. అదే సీక్వెన్స్ గురించి ఏ.ఏం. రత్నం మాట్లాడుతూ దీన్ని ఫైట్ అనలే 100 మంది మధ్యలో ఒక మనిషి ఇరుక్కుంటే.. రియల్గా ఎలా ఫేస్ చేస్తాడనే ఐడియాను పవన్ లాజిక‌ల్‌గా డిజైన్ చేశారు. ఒక సినిమాటిక్ ఫైట్ మాదిరిగా ఉండకూడదని రియల్ గా ఉండాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ఎలాంటి డూప్ లేకుండా తానే యాక్ట్‌ చేసి చూపించాడు. ఈ సీక్వెన్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులకు గూస్ బంప్స్‌ వస్తాయంటూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ వివరించాడు. వీరమల్లు గురించి దర్శకనిర్మాతలు చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి.