స్టేజ్ పై అందరికీ క్షమాపణలు చెప్పిన పవన్.. కారణం అదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా దూసుకుపోతున్న పవన్.. తాజాగా హరిహర వీరమల్లు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచి ఆడియ‌న్స్‌లో భారీ హైప్ నెల‌కొంది.ఈ క్రమంలోనే సినిమా ప్రీమియర్ షోస్ తోనే రూ.30 కోట్ల వరకు కలెక్షన్లు కలగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో సినిమా సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు మేకర్స్‌. ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు.. డైరెక్టర్ గీత కృష్ణ, ప్రొడ్యూసర్ ఏ.ఏం.రత్నంతో పాటు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లైన నవీన్ యార్నేని, వై. రవిశంకర్, హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి.

పవన్ కళ్యాణ్ మీట్‌లో మాట్లాడుతూ రాజకీయాలు, ప్రత్యార్థుల కుట్రల కారణంగా.. నా సినిమాలు తీసిన నిర్మాతలు ఎంతగానో నష్టపోయారని వివరించాడు. వీర‌మ‌ల్లు సినిమాకు అన్ని విధాలా నేను సహకరించాలని.. అది నా బాధ్యత అంటూ చెప్పుకొచ్చిన పవన్.. స్టేజ్ పై మాట్లాడుతూ అక్కడ ఉన్న వారందరికీ క్షమాపణలు తెలియజేశాడు. నేను ఈవెంట్‌కు రావడం ఆలస్యమైంది. నా కోసం వేచి ఉన్న వాళ్ళందరికీ క్షమాపణలు అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. క్యాబినెట్ మీటింగ్‌లో కారణంగా గంట ఆలస్యమైంది అంటూ వివరించాడు. నిజానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఇలా అందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేనేలేదు.

ఆయినా.. పవన్ స్టేజ్‌పై అందరికి క్షమాపణలు చెప్పడంతో పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అది ఆయన మనస్తత్వం అని.. ఎంత ఎదిగిన కాస్త కూడా గర్వం తల‌కెక్క‌లేద‌ని.. వినయంగా ఒదిగి ఉండే స్వభావం అయిందంటూ మురిసిపోతున్నారు. ఇక ఇప్పటివరకు ఎలాంటి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనని పవన్.. ఏ.ఎం.రత్నం కోసం ప్రమోషన్స్ లో సందడి చేశాడు. తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని ఆలోచించే మనస్తత్వం ప‌వ‌న్‌ది. దాని కోసమే ఇప్పుడు సినిమా ఈవెంట్‌లో కూడా సందడి చేశాడంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవెంట్ లో పవన్ మాట్లాడితే క్షమాపణలు చెప్పిన వీడియోను ట్రెండ్‌ చేస్తున్నారు.