టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార పుట్టినరోజు నిన్న గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కూతురు టీనేజ్‌లో అడుగుపెట్టినందుకు.. విషెస్ తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. తెగ మురిసిపోయాడు. అంతేకాదు.. ఆయన నిన్న షేర్ చేసిన మరో పోస్ట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఈ పోస్ట్‌లో మహేష్ సైయారా మూవీ టీం పై ప్రశంసలు కురిపించాడు.
కథ, నటులు పెర్ఫార్మెన్స్ అంతా బాగున్నాయని.. అహాన్ పాండే, అనీత్ పద్ధా తమ పాత్రల్లో జీవించేసారని చెప్పుకొచ్చాడు. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా గా రూపొందిన సైయారా ఈ నెల 18న బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజై.. పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.40 కోట్ల వసూలను కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కజిన్ ఆహాన్ పాండే హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అతని డెబ్యూ కావడం విశేషం. అనీత్ పద్ధా హీరోయిన్గా మెరిసింది. ఇక సినిమాల్లో.. కృష్ణ కపూర్, వాణి పాత్ర అనే ఇద్దరు వ్యక్తులు.. ఒకరికొకరు ఎలా పరిచయం అవుతారు.. ఎలా ప్రేమలో పడతారు.. వారి మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి.. మళ్ళీ వాళ్ళు కలుస్తారా.. లేదా.. లాంటి అంశాలతో సినిమాను రూపొందించారు. మోహిత్ సూరి బహించిన ఈ సినిమా కొత్త స్టోరీ కాకపోయినా.. సినిమాలో ఎమోషన్స్, మ్యూజిక్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.