టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొద్ది గంటల క్రితం కింగ్డమ్ మూవీతో ఆడియన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఒరిజినల్ టాక్ తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇలాంటి క్రమంలోనే.. సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు నెటింట వైరల్గా మారుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నాగవంశీ ప్రొడ్యూసర్గా రూపొందిన ఈ సినిమాల్లో విజయ్ దేవరకొండ హీరోగా మెరవగా.. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక.. సినిమా రిలీజ్ కు ముందే కేవలం ట్రైలర్ కంటెంట్ తోనే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ లోను జోరు చూపించిన కింగ్డమ్.. వన్ లాక్ ప్లస్ సేల్స్ ను దక్కించుకుంది. ఇక ట్రైలర్లో చూపించినట్లుగా విజయ్ పోలీస్, స్పైగా, ఓ గ్యాంగ్ లీడర్ ఇలా మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో మెరిశాడు. మరోవైపు సత్యదేవకు తమ్ముడిగా విజయ్ మెరవనున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ను తీసుకున్నారంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
ఈ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొంత లాభం షేర్ రూపంలో దక్కనుందట. ఆయనతో పాటు డైరెక్టర్ గౌతం తిన్ననూరి రూ.7 కోట్లు, విజయ్ అన్నగా నటించిన సత్యదేవ్ రూ.3 కోట్లు, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ రూ.10 కోట్లు, హీరోయిన్ భాగ్యశ్రీ రూ.50 లక్షలు ఇతర కాస్టింగ్ రెండు కోట్ల వరకు పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. టెక్నీషియన్స్ రూ.7 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం. ఎలా మొత్తం కాస్టింగ్, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ రూ.60 కోట్ల వరకు అయ్యిందని టాక్. ఇక సినిమాకు మొత్తంగా రూ.130 కోట్ల వరకు బడ్జెట్ అయిందట. మరి తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆ రేంజ్ లో కలెక్షన్ కొల్లగొట్టి.. బ్రేక్ ఈవెన్ రీచ్ అవుతుందా.. లేదా.. చూడాలి.