పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా “ది రాజా సాబ్” ఎట్టకేలకు డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ఎప్పటికే ప్రకటించారు. కానీ… ఇటీవల ఓ వర్గం నుంచి డేట్ మారబోతోందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఒక అయోమయం నెలకొంది. సంక్రాంతి సెటప్ చూసి డేట్ మారుతుందేమోనన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. కానీ దీనికి మేకర్స్ వైపు నుంచి స్పష్టమైన క్లారిటీ వచ్చింది – “ది రాజా సాబ్ డిసెంబర్ 5కే.. ఎలాంటి మార్పు లేదు!”
డిసెంబర్ 5.. ఓ గోల్డెన్ డేట్.. ఎందుకో తెలుసా? … ఈ డేట్ వయు వంటి సినిమాలకు ఎప్పటికీ బ్లాక్‌బస్టర్ రిజల్ట్ ఇచ్చిన తేదీ. ‘పుష్ప 2’ ఇదే డేట్‌కు విడుదలై రెండు వేల కోట్ల దాకా రన్ చేసింది. ‘యానిమల్’ కూడా డిసెంబర్ మొదటి వారం వచ్చి తొమ్మిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలు సోలోగా వచ్చి ఊచకోతలే కొట్టాయి. దాంతో డిసెంబర్ 5 అనేది టాలీవుడ్, బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకి కూడా నచ్చిన డేట్‌గా నిలిచింది. ప్రభాస్ వంటి స్టార్ ఓపెనింగ్స్ మీదనే సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్తారు. అలాంటి స్థాయిలో మాస్-ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న “ది రాజా సాబ్”కి డిసెంబర్ 5 కంటే బెస్ట్ డేట్ మరొకటి ఉండదని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
సంక్రాంతి అంటే కాంపిటీషన్ భయపడాల్సిందే..! ఒక్కవేళ డేట్ మారి సంక్రాంతికి వెళ్తే పరిస్థితి ఎలాగుంటుంది? మళ్లీ మాస్ మెగా హీరో చిరంజీవి మెగా157 (చిరు – రావిపూడి కాంబో), రవితేజ మూవీ, నవీన్ పోలిశెట్టి – అనగనగా ఒక రాజు వంటి సినిమాలు బరిలో ఉంటే? అంతేకాకుండా విజయ్ నటిస్తున్న “జననాయకన్” తమిళనాడు, కేరళ మార్కెట్లపై ప్రభాస్ సినిమా ఓపెనింగ్స్‌కి షేడో వేయొచ్చు. ఇలాంటి తలనొప్పులు ఎందుకు? డిసెంబర్ 5 డేట్ ప్రాక్టికల్ గా చూస్తే బేస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. రెండు వేల కోట్లు టార్గెట్.. కన్ఫ్యూజన్ ఎండ్..! ఇప్పుడు క్లారిటీ ఒకటే – “ది రాజా సాబ్” డిసెంబర్ 5నే వస్తుంది. రెండు వేల కోట్ల కలెక్షన్ టార్గెట్ చేస్తోన్న ఈ మూవీని డేట్ మార్చడం లాంటి అనవసర రిస్క్ ఎందుకు తీసుకుంటారు? రణ్‌వీర్ సింగ్ సినిమా ఒకటి ఉన్నా.. ప్రభాస్ సినిమాకు అది పెద్దగా ఇబ్బంది కాదు. దేశవ్యాప్తంగా ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ ముందు పోటీ అనేది పెద్ద మ్యాటర్ కాదు.