టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ కూడా ఒకటి. భారీ అంచనాల నడుమ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తోనే ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంది. సినిమా బ్రదర్ సెంటిమెంట్‌తో రూపొందుతుందని క్లియర్‌గా క్లారిటీ వచ్చేసింది. ఇక.. సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన బ్రదర్ సెంటిమెంట్ సాంగ్ సైతం అందరిని ఆకట్టుకోవడం విశేషం. ఈ క్రమంలోనే సినిమా ఓపెనింగ్స్ సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది కింగ్డమ్. ఇలాంటి నేపథ్యంలో సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ ట్విటర్ వేదికగా తెగ త్రోల్ చేస్తూ కామెంట్స్ మొదలయ్యాయి. ఇంతకీ సినిమా నిజంగానే కాపీనా అని ఆశ్చర్యపోతున్నారు.
అయితే.. ఇందులో బాత్రూం ఉన్నా లేకపోయినా బాక్సాఫీస్ నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అది ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా ఆ కథను మరో సినిమా స్టోరీతో పోలుస్తూ కాఫీ అంటూ కామెంట్లు చేయడం ట్రెండ్‌గా మారిపోయింది. అయితే.. ఒక్కోసారి నెటిజన్స్ ఇలా పోలుప్తూ చేసిన కామెంట్స్ నిజాలు కూడా అవుతాయి. అయితే.. తాజాగా కింగ్డమ్ అప్పుడెప్పుడో వచ్చిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రిజం బ్రేక్‌కు కాపీ అంటూ ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. ఇంతకీ ఏంటా వెబ్ సిరీస్.. అసలు కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినిమాలో కీ పాయింట్ విజయ్ దేవరకొండ..లో శ్రీలంక జైలుకెళ్ళడం. అంతేకాదు.. బ్రదర్ సెంటిమెంట్ కూడా హైలెట్ గా నిలిచింది. సేమ్ ఇదే పాయింట్.. ఇలాంటి నేపథ్యంలోనే ప్రిజన్ బ్రేక్ సిరీస్ కూడా వచ్చింది.
పూర్తిగా కింగ్డమ్ స్టోరీ కాదు. కానీ.. మెయిన్ పాయింట్ మాత్రం బ్రదర్ సెంటిమెంట్, హత్య నేరం కింద జైలుకు వెళ్లిన అన్నను కాపాడడానికి కావాలనే ఓ కేసులో హీరో ఇరుక్కుని అదే జైలుకు వెళ్లడం. తర్వాత అక్కడ నుంచి వాళ్ళ అన్నను తప్పించి.. బయటకు తీసుకెళ్లి పోవడం. సింపుల్గా చెప్పాలంటే ఇదే కదా 2005లో స్ట్రీమ్ అయిన వెబ్ సిరీస్ లో మొత్తం ఐదు సీజన్‌లు. ఇక మొదటి సీజన్‌కు.. విజయ్ దేవరకొండ కింగ్డమ్‌కు పోలికలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మూవీ ట్రైలర్ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ అండర్ కవర్ కాప్‌గా అదే జైలుకు వెళ్లి.. అన్నను కాపాడతానని చెప్పిన డైలాగ్ ఈ కామెంట్స్ కు మరింత ఊతాన్ని ఇచ్చింది.
అన్నను కాపాడడానికి ఏమైనా చేయడానికి సిద్ధం. మొత్తం తగలబెట్టేస్తా అంటూ విజయ్ చెప్పిన డైలాగ్.. ఫ్రిషన్ బ్రేక్‌లో అన్న కోసం ఏమైనా రూల్స్ బ్రేక్ చేసి చివరకు అక్కడి నుంచి తప్పించుకుని తీసుకువెళ్లడాని కంపేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. మెయిన్ పాయింట్ ఒకటే. అయినా సినిమా పూర్తిగా కాఫీ అనడం మాత్రం అసలు సరికాదు. కారణం మనం ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర చూస్తున్న సినిమాలన్నీ ఒక్క 7 కథల చుట్టూనే రకరకాలుగా మార్చి మార్చి తిప్పుతూ రూపొందిస్తున్నారు రచయితలు. కాకపోతే.. కథను ఆడియన్స్‌కు చూపించే విధానం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక జూలై 31న ఈ సినిమా రిలీజ్ డేట్ బయటకు వస్తే గాని.. ఈ కామెంట్స్‌లో వాస్తవం ఎంతో తెలియదు.