పాన్ ఇండియన్ పాపులర్ సినిమాటో గ్రాఫర్ కే.కే. సంథిల్ టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇక తాజాగా.. సెంథిల్ ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త అయిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు.. కిరీటి రెడ్డి నటించిన జూనియర్ సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేశాడు. రాధాకృష్ణ డైరెక్షన్‌లో యూత్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో కిరిటీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా వారాహి చలనచిత్రం బ్యానర్లపై రజిని కొర్రపాటి ప్రొడ్యూసర్ గా తెరకెక్కనుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ టీజర్, ట్రైలర్ అలాగే పాటలు సినిమాకు ఛార్జ్ బస్టర్స్ గా నిలిచాయి. మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇక సినిమాకు డివోపిగా సినిమాటోగ్రాఫర్ కె.కె. సంథిల్ కుమార్ వ్యవహరించడం విశేషం.
జూలై 19న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో తాజాగా సందడి చేసిన సెంథిల్ విలేకరులతో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. నిర్మాత సాయి గారితో నాకు మొదటి నుంచే పరిచయం ఉందని ఈగ సినిమా ఆయనతో అప్పటికే పనిచేశా. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఆయన నన్ను కలిశారు.. డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పిన స్టోరీ నాకు బాగా నచ్చేసింది. అలాగే.. మంచి ప్రొడక్షన్ హౌస్., టెక్నికల్ టీం కూడా నచ్చారు. దీంతో వెంటనే ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నా. ఇక కథలో నాకు నచ్చిన ఎలిమెంట్ ఫ్యామిలీ డ్రామా. డ్యాన్స్ లు, ఫైట్లు ఉంటే చాలు అనుకుంటారు కానీ.. ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి.
అది నాకు చాలా నచ్చింది నన్ను ఇంప్రెస్ చేసింది. కొత్త హీరోలు ఇలాంటి ఛాలెంజ్ను తీసుకోవడం మరింతగా ఇంట్రెస్ట్ ను పెంచింది అంటూ వివరించారు. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేక హోదా.. హెవీ గ్రాఫిక్స్, సీసీ వర్క్ ఉన్న సినిమాల తర్వాత ఇలాంటి సినిమా చేయడం నాకు రిఫ్రెషింగ్‌గా ఉంటుంది అనిపించింది. నేను అందుకే సినిమాకు ఒప్పుకున్నా. ఇందులో ఉన్న కోర్ ఎమోషన్స్ నాకు చాలా నచ్చేసాయి. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాస్ రావడం ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా చేసే అవకాశం నాకు రావడం సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ఈవెంట్లో SSMB 29కు తనుపని చేయకపోవడం పై క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి సినిమాలకు సూపర్ గ్రాండ్ ఇయర్ విజువల్ లుక్స్ అందించే కీలక పాత్ర సెంథిల్ పోషిస్తూ ఉంటారు.
అలాంటిది SSMB 29 లో ఆయన పని చేయకపోవడం సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. సై నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి దాదాపు అన్ని సినిమాలకు సెంధిలే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇలాంటి క్రమంలో తాను ఎస్ఎస్ఎంబి 29 లో పనిచేయకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. దానికి స్పెషల్ కారణాలు ఏవి లేవని.. విక్రమార్కుడు, మర్యాద రామన్న సినిమాలకు రాజమౌళి గారు వేరే సినిమాటోగ్రాఫర్తో పనిచేశారు. ఈసారి కూడా అలాగే జరిగింది. మ్యూచువల్ అండర్స్టాండింగ్‌తో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆయన కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అంతేకానీ.. మా ఇద్దరి మధ్యన ఎలాంటి సమస్యలు లేవు. నేను కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. భవిష్యత్తులో అవకాశం ఉంటే మళ్ళీ ఇద్దరం కలిసే పని చేస్తామంటూ సెంథిల్ చెప్పవచ్చాడు. ప్రస్తుతం సెంథిల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.