ఆ రెండు సినిమాలు తీసి పెద్ద‌ తప్పు చేశా.. నాగ వంశీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. గౌతం తిన్న‌నూరి డైరెక్షన్‌లో కింగ్‌డ‌మ్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. జులై 31న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాగవంసీ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. తాజాగా.. అయిన తన కెరీర్‌లో చేసిన తప్పుల గురించి చేసిన ఓపెన్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ మూవీకి నేను అనుకున్న రేంజ్‌లో కలెక్షన్స్ అయితే రాలేదు అంటూ వివ‌రించిడు.

Ranarangam (Sharwanand) (2019) | Cast & Crew | News | Galleries | Movie  Posters | Watch Ranarangam (Sharwanand) Movie Online

మరోవైపు గుంటూరు కారం సినిమాకు ట్రోల్స్ ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు అంటూ కామెంట్స్ చేశాడు. తెలిసి తెలిసి నేను తప్పు చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది రణరంగం. అప్పటికి మా బాబాయ్.. శర్వానంద్‌ చిన్నపిల్లాడిలా ఉంటాడు. అందులోను లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ఇలాంటి టైం లో ఏజెంట్ క్యారెక్టర్‌తో సాహసం చేయడం అవసరమా అని చెప్తూనే ఉన్నాడు. కానీ.. నేను, సుదీర్ కొత్తగా ఉంటుందని ప్రయత్నాలు మొదలెట్టం. అసలు వర్కౌట్ కాలేదు అంటూ వివరించాడు. ఈ సినిమా తీయడం నేను చేసిన పెద్ద తప్పు అనుకుంటా.. రవితేజ లాంటి వాళ్ళతో చేసి ఉంటే సినిమా హిట్ అయ్యేదేమో అంటూ కామెంట్స్ చేశాడు.

Aadikeshava Movie Review: రివ్యూ: ఆదికేశవ.. వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా  నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? | aadikeshava-telugu-movie-review-in-telugu

ఇక ఆదికేశవ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాని రిపేర్ చేసేందుకు ప్రయత్నించాం. కానీ.. అసలు వర్కౌట్ కాలేదు. రెండు సినిమాలు నా కెరీర్‌లో కాస్ట్లీ మిస్టేక్స్ అని అర్థమయిందంటూ నాగవంశీ వివరించాడు. రణ‌రంగం సినిమాలో శర్వానంద్ హీరోగా.. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా మెరువగా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. 2019 ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆదికేశవ.. పంజా వైష్ణవ్‌ తేజ్, శ్రీ లీల జంటగా తెర‌కెక్కగా.. 2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్‌ను మూటక‌ట్టుకుంది.